Sri Sathya Sai District: అయ్యో పాపం.. అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. రంగంలోకి దిగిన అధికారులు
గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత మృతితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపైనే చిరుత కళేబరం పడిఉండటంతో వాహనదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు.
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలో మరో చిరుత మృతదేహాన్ని గుర్తించారు. మడకశిర- బెంగళూరు ప్రధాన రహదారిపై చిరుత మృతిచెంది పడివుండటం గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతిచెందినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత మృతితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపైనే చిరుత కళేబరం పడిఉండటంతో వాహనదారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు.
గత నెలలో తెలంగాణ ప్రాంతంలోని నల్లమల అడవుల్లో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నల్లమల అడవుల్లోని అమరిగిరి గ్రామానికి వెళ్లే రోడ్డుకు సమీపంలో చిన్న గండి అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కింద 10 ఏళ్ల చిరుత పులి విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..