AP Budget 2024-25 Highlights: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే.. ఏపీ బడ్జెట్ హైలెట్స్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. బడ్జెట్‌పై సభ్యులందరూ అవగాహనతో రావాలని.. సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 10గంటల 7 నిమిషాలకు పయ్యావుల బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది.. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతకుముందు కేబినెట్ సమావేశం జరిగింది. బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది.. అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి..
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఏపీ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.. బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో చర్చ జరగనుంది. బడ్జెట్‌పై సభ్యులందరూ అవగాహనతో రావాలని.. సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.
https://www.youtube.com/watch?v=NQjLk-PGOe0
LIVE NEWS & UPDATES
-
రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు
డిజిటల్ వ్యవసాయానికి రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు
ఎన్జీరంగా యూనివర్సిటీకి రూ.507.03 కోట్లు
ఉద్యాన యూనివర్సిటీకి రూ.102.22 కోట్లు
మత్స్యరంగం అభివృద్ధికి రూ.521.34 కోట్లు
పశు సంవర్థకశాఖకు రూ.1095.71 కోట్లు
ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి రూ.38 కోట్లు
శ్రీవెంకటేశ్వర పశువైద్య వర్సిటీకి రూ.171.72 కోట్లు
రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
-
అన్నదాత సుఖీభవ పథకానికి..
అన్నదాత సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు
వడ్డీలేని రుణాలకు రూ.628 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు రూ.44.03 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు
పంటల బీమాకు రూ.1023 కోట్లు
ఉద్యానవనశాఖకు రూ.3,469.47 కోట్లు
పట్టు పరిశ్రమకు రూ.108 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.8 కోట్లు
సహకారశాఖకు రూ.308.26 కోట్లు
-
-
వైఎస్ జగన్ కీలక నిర్ణయం..
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించిన వైసీసీ అధినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.. ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్ అసెంబ్లీ బయట స్పందించాల్సిన అంశాలపై చర్చ నిర్వహిస్తున్నట్లు సమాచారం..
-
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి కేటాయించిన నిధులివే..
రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు
భూసార పరీక్షలకు 38.88 కోట్లు
ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు
-
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం
వ్యవసాయం ఆధారంగా 62శాతం జనాభా జీవిస్తున్నారు
గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది
రైతులకు పంట బీమా అందించలేదు
పెట్టుబడి సాయం పెంచి నెలరోజుల్లోనే అందించాం
వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత
రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు
-అచ్చెన్నాయుడు
-
-
రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం
ఏపీ ప్రభుత్వం 2047 టార్గెట్‌గా ముందుకెళ్తోంది
-మంత్రి అచ్చెన్నాయుడు
-
వ్యవసాయ శాఖకు భారీగా కేటాయింపులు
పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు.
-
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది..
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది..
గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు..
93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది. – మంత్రి పయ్యావుల కేశవ్ .
-
వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి..
వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి..
పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు..
ఉపాధ్యాయులపై యాప్ భారం తగ్గింపు..
192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు..
విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం.
-
దీపం పథకానికి రూ.895 కోట్లు..
దీపం పథకానికి రూ.895 కోట్లు..
దీపం పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి..
-
దేవాదాయ శాఖ కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులు
దేవాదాయ శాఖ కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులు
సుమారు 6,000 దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
అర్చకుల వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు
వేద విద్య చదువుకుని నిర్యుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి
కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతుల పునరుద్ధరణ
రూ.113 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనులు
-
ఏపీ ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు
ఏపీ అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు
గత ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలు అనుసరించింది
బడ్జెట్ అంటే.. అంకెలకు మించిన ప్రాముఖ్యత ఉంది
రాష్ట్రాన్ని కాపాడాలని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం
గత సర్కార్ రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించింది
గత ప్రభుత్వంలో పరిమితికి మించి అప్పులు చేశారు
ముఖ్యమైన పథకాలకూ చెల్లింపులు చేయలేదు
ప్రాజెక్టులన్నింటినీ స్తంభింపజేశారు
- -పయ్యావుల కేశవ్
-
అశాస్త్రీయ విభజనతో ఏపీ చాలా నష్టపోయింది
అశాస్త్రీయ విభజనతో ఏపీ చాలా నష్టపోయింది
ప్రస్తుతం పునర్‌నిర్మాణ కార్యక్రమాన్నిచేపడుతున్నాం
గత పాలన విధానాలతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది
ఇంధన, అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చాం
సంక్షేమంతో కూడిన సుస్థిరాభివృద్ధిసాధించాం
- -పయ్యావుల కేశవ్
-
గుంతలు లేని రహదారులు మా లక్ష్యం..
సంక్రాంతి నాటికి “గుంతలు లేని రహదారుల ఆంధ్ర” మా లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
-
పోలీస్ శాఖకు రూ. 8495 కోట్లు కేటాయింపు
2024-25 ఆర్థిక సంవత్సరానికి పోలీస్ శాఖకు రూ. 8495 కోట్లు కేటాయింపు
అటవీ శాఖకు రూ.687 కోట్లు కేటాయింపు
-
స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు కేటాయింపు
పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు
ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు
189 కి.మి. పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం
స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు కేటాయింపు
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కోసం 3శాతం రిజర్వేషన్
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ. 322 కోట్లు
-
సంక్షేమానికి కేటాయింపులు ఇలా..
ఆరోగ్యం -రూ.18,421 కోట్లు
ఉన్నత విద్య -రూ.2326 కోట్లు
ఎస్సీ సంక్షేమం -రూ.18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం -రూ.7,557
బీసీ సంక్షేమం -రూ.39,007 కోట్లు
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం -రూ.4,376 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు -రూ.11,855 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం -రూ.4285 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ -రూ.1215 కోట్లు
-
గృహనిర్మాణానికి రూ.4012 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం- రూ.3,127 కోట్లు
- నీటిపారుదల -రూ.16,705 కోట్లు
- గృహనిర్మాణం -రూ.4012 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు
-
రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
- రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
- రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు
- మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు
- రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు
- ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు
- GSDPలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
Published On - Nov 11,2024 10:45 AM