AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ మై గాడ్.. 4 సింహాలతో కలిసి నిద్రపోతున్న మహిళ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఇక వీడియో షేర్‌ చేస్తూ ఆస్పినాల్‌ ఈ నాలుగు సింహం పిల్లల కథనాన్ని వెల్లడించారు. ఈ సింహం కూనలను రక్షించినట్లు తెలిపారు. ఇక ఈ పిల్లలను పెంచడం కోసం తను వాటికి తల్లిలా మారానని చెప్పింది. అందుకే వాటితోనే నిద్రపోతున్నట్టుగా చెప్పింది.

ఓ మై గాడ్.. 4 సింహాలతో కలిసి నిద్రపోతున్న మహిళ.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Rescued Lion Cubs
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2024 | 9:28 AM

Share

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ మంచం మీద పడుకుని నిద్రపోతోంది. అందులో వింత, షాకింగ్‌ విషయం ఏముందిలే అనుకుంటున్నారా..? కానీ, అక్కడ కనిపించింది మాత్రం నిజంగానే షాకింగ్‌గా ఉంది. ఆమె చుట్టూ 4 సింహం పిల్లలు కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసిన జనాలు రకరకాలుగా స్పందించారు. సింహాం పిల్లలను ఆడిస్తున్న ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఈ వీడియో కొంతకాలం క్రితం ఈ సింహం పిల్లల ప్రాణాలను కాపాడిన జంతు రక్షకురాలు ఫ్రెయా ఆస్పినాల్‌కు సంబంధించినది. ఆస్పినాల్ షేర్‌ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దీనిలో ఆమె తన ముఖం చుట్టూ కూడా సింహం పిల్లలు పడుకుని ఉన్నాయి. ఇక వీడియో షేర్‌ చేస్తూ ఆస్పినాల్‌ ఈ నాలుగు సింహం పిల్లల కథనాన్ని వెల్లడించారు. ఈ సింహం కూనలను రక్షించినట్లు తెలిపారు. ఇక ఈ పిల్లలను పెంచడం కోసం తను వాటికి తల్లిలా మారానని చెప్పింది. అందుకే వాటితోనే నిద్రపోతున్నట్టుగా చెప్పింది. ఆస్పినాల్ పిల్లలను ఆఫ్రికాకు పంపాలని యోచిస్తోంది. గతంలో తను రక్షించి జంతువులను అక్కడే ఉంచినట్టుగా స్పష్టం చేశారు. కాగా, ఈ వీడియోకి నెట్టింట పెద్ద సంఖ్యలో వ్యూస్‌తో పాటు, లైకులు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోపై జనాలు భిన్నమైన స్పందనను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది మహిళను పొగుడుతుండగా, మరికొంత మంది వన్యప్రాణులకు దగ్గరవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సింహం పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా బాగుంది, కానీ, ఆమెకు మాత్రం జంతువులతో ప్రమాదం తప్పదంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుని ట్రక్ డ్రైవింగ్‌కి.. ఓ అమ్మాయి జర్నీ
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
అర్జెంటీనాలో దారుణం.. పెరిగిన ఆత్మహత్యల సంఖ్య
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు