సౌదీ అరేబియాలో మెట్రోరైలు నడుపుతున్న తెలుగు మహిళ.. హ్యాట్సాఫ్ ఇందిర
సౌదీ అరేబియాలో రైళ్లు నడపడానికి ముందు..ఇందిర హైదరాబాద్ మెట్రో రైల్‌లో మూడేళ్లు పనిచేశారు. ఐటి ఇంజనీరింగ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ అయిన ఇందిర ఇప్పటివరకు 15,000 కిలోమీటర్లకుపైగా రైలు నడిపారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబు కంటే రైలు నడపటమే తనకు ఇష్టం
హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్‌లో మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ 2025 జనవరిలో ప్రారంభం కానుంది. వాస్తవానికి ఇందిర ఈగలపాటి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ధూళిపాళ్ల. వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. లోకో పైలట్ ఇందిరా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు. సౌదీలో మెట్రో రైలు నడుపుతున్నారు ఇందిర. రియాద్ మెట్రో రైలులో పైలట్‌గా పనిచేస్తున్నారు.
సౌదీ అరేబియాలో రైళ్లు నడపడానికి ముందు..ఇందిర హైదరాబాద్ మెట్రో రైల్‌లో మూడేళ్లు పనిచేశారు. ఐటి ఇంజనీరింగ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ అయిన ఇందిర ఇప్పటివరకు 15,000 కిలోమీటర్లకుపైగా రైలు నడిపారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబు కంటే రైలు నడపటమే తనకు ఇష్టం అన్నారు ఇందిర. ఇప్పుడు విదేశాలలో లోకో పైలట్‌లుగా పనిచేసిన అరుదైన మహిళల్లో ఇందిరా ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..