Drinking Hot Water: 21 రోజులు ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగి చూడండి..! శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

ప్రతిరోజూ ఉదయం వేడి నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు కూడా చెబుతుంటారు. ఎండాకాలం, వానలు, చలికాలం అనే తేడా లేకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. వేడి నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి...

Jyothi Gadda

|

Updated on: Nov 11, 2024 | 7:13 AM

చిన్న పిల్లలు పెద్దవాళ్ళలా వేడినీళ్ళు తాగకూడదు. ఎందుకంటే వారి జీర్ణవ్యవస్థ పెద్దవారిలా కాకుండా చాలా సున్నితంగా ఉంటుంది. వేడినీరు తాగడం వల్ల వారి కడుపుకు హాని కలుగుతుంది. కావున కాచిన నీటిని చల్లార్చుని తాగాలి. లేకుంటే వారికి పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.

1 / 6
వేడినీరు తాగడం మూత్రపిండాలకు మంచిది. శరీరం నుండి బ్యాక్టీరియా, అదనపు లవణాలను సులభంగా తొలగిస్తుంది. గ్యాస్ లేదా పొట్ట వంటి అనేక సమస్యలు దూరమవుతాయి. మీరు వేడి నీటిలో జీలకర్ర వేసుకుని కూడా తాగొచ్చు. ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను నయం చేస్తుంది.

2 / 6
కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వేడి నీటిని నివారించాలి. ఎందుకంటే ఇది వారి కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి వారు చల్లటి నీరు తాగడం మంచిది. అలాగే వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు పాటించాలి. కాలేయం చాలా సున్నితమైన అవయవం. దానిలోని ఏ రకమైన సమస్య తలెత్తినా శరీర వివిధ విధులను ప్రభావితం చేస్తుంది.

3 / 6
వేడినీరు తాగడం వల్ల కండరాలు బలపడతాయి. ఇది నొప్పి, దృఢత్వాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు వేడి నీటి వినియోగం కండరాలకు సంబంధించిన అనేక వ్యాధులను దూరం చేస్తుంది. మనం వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా భారీ శారీరక శ్రమ చేసినప్పుడు మన కండరాలు గట్టిగా లేదా నొప్పి వస్తుంది.. అలాంటి వారికి వేడి నీటిని తాగడం వల్ల కండరాలు వేడెక్కుతాయి. నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

4 / 6
క్రమం తప్పకుండా ఉదయాన్నే వేడినీరు తాగితే నరాల పనితీరు పెరిగి రక్తప్రసరణ మెరుగవుతుంది. ఖాళీకడుపుతో వేడినీటిని తాగటం అలవాటుగా చేసుకుంటే.. చర్మ సంబంధిత సమస్యలు కూడా దరి చేరవు. చర్మం తేమగా, వెచ్చగా ఉంటుంది. ముఖంపై మొటిమలు కూడా రావు. (నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం)

5 / 6
వేడి నీటిని తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. వేడి నీరు తాగడం వల్ల బరువును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేడి మీ ఆకలిని తగ్గిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా అడ్డుకుంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ద్వారా శక్తిని పెంచుతుంది. ఇది మీ అలసటను కూడా తొలగిస్తుంది.

6 / 6
Follow us