అయ్యో రామా.. అందం ఆమె సావుకొచ్చింది.. లక్షలు పోసి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న యువతి.. చివరకు..
అందంగా కనిపించాలని కోరుకున్న ఓ మహిళ ఒక్కరోజులోనే 6 కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. ఆ తరువాత ఆమె మరణించింది. దీంతో రూ 1.5 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కోర్టు కెక్కింది మృతురాలి కుటుంబం. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
చాలా మంది తమ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇందులో కొందరు సక్సెస్ అవుతుంటారు. మరికొందరు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఒక మహిళ ఒకే రోజులో 6 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడంతో ప్రాణాలు కోల్పోయింది. మహిళ మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు సదరు క్లినిక్‌పై రూ.1.5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దక్షిణ చైనాలో చోటు చేసుకుంది.
సమాచారం మేరకు.. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని గుయిగాంగ్ ప్రావిన్స్ నుండి ఈ కేసు నమోదైంది. ఇక్కడ ఒక మహిళ డిసెంబర్ 9, 2020న ఒక క్లినిక్‌కి వెళ్లి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోలానుకుంది. అందుకోసం మహిళ 40,000 యువాన్ల (నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువ) కంటే ఎక్కువ ఖర్చు చేసింది. సర్జరీలో భాగంగా మొదట ఆమె రెండు రెప్పల సర్జరీ జరిగింది. ఆ తర్వాత ముక్కు సర్జరీకి ఐదు గంటల సమయం పట్టింది. ఆమె తొడలపై లైపోసక్షన్ ప్రక్రియను నిర్వహించారు. మరుసటి రోజు ఉదయం ఆమె ముఖం, రొమ్ములలో కొవ్వును ఇంజెక్ట్ చేశారు. ఇది ఐదు గంటల పాటు కొనసాగింది. డిసెంబర్ 11న, లియు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఎలివేటర్ వద్దకు చేరుకోగానే, ఆమె క్లినిక్‌లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
వెంటనే ఆమెను ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేస్తుండగానే..కొద్దిసేపటికే ఆ మహిళ మరణించింది. లైపోసక్షన్ తర్వాత వచ్చిన మార్పుల వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. కాస్మెటిక్ సర్జరీలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు డిగారు. ఇందుకోసం 1.18 మిలియన్ యువాన్ (US$168,000) నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, క్లినిక్‌పై దావా వేశారు.
మే 2021లో న్యాయస్థానం తొలుత మహిళ మరణానికి క్లినిక్‌ని బాధ్యులను చేసి, ఒక మిలియన్ యువాన్ (రూ. 1 కోటి కంటే ఎక్కువ) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, విచారణ సందర్భంగా క్లినిక్ వాదనలు విన్న న్యాయస్థానం పరిహారం మొత్తాన్ని 590,000 యువాన్లకు (రూ. 70 లక్షలు) సవరించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..