Soldiers: యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో

Soldiers: యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో

Anil kumar poka

|

Updated on: Nov 12, 2024 | 11:51 AM

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ఇటీవల ఉత్తర కొరియా సైన్యం కూడా చేరింది. రష్యా తరఫున పోరాడేందుకు వందల సంఖ్యలో యుద్ధ రంగంలోకి వెళ్లిన కిమ్‌సేనకు.. అపరిమిత ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉండటం కొత్త మార్పుకు దారి తీసింది. దీంతో విచ్చలవిడిగా అశ్లీల చిత్రాలు చూడటంలో నిమగ్నమయ్యారని బ్రిటన్‌ వార్తా సంస్థ ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం తెలిపింది.

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ రష్యా కోసం భారీగా ఆయుధ సామగ్రి పంపిస్తోన్న ఉత్తర కొరియా.. ఇటీవల సైనిక సహాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వందల సంఖ్యలో సైనికులను రష్యాకు పంపించినట్లు దక్షిణ కొరియాతోపాటు ‘నాటో’ కూడా పేర్కొంది. ఇలా ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకున్న ఉత్తర కొరియా సైన్యానికి అపరిమిత ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇటువంటి వెసులుబాటు గతంలో ఎన్నడూ ఎరుగని కిమ్‌ సేన.. పోర్న్‌ చూడటంలో మునిగిపోయినట్లు బ్రిటన్‌ మీడియా కథనంలో వెల్లడించింది. అయితే, వారి ఇంటర్నెట్‌ అలవాట్లను ఎలా గుర్తించారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు, దీనిని ఇంకా ధ్రువీకరించలేకపోయామని అమెరికా రక్షణ శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం.

రష్యాకు మద్దతుగా భారీ సంఖ్యలో కిమ్‌ సైన్యం ఉక్రెయిన్‌పై పోరాడనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి దాదాపు 11 వేల మంది ఉత్తర కొరియా సైనికులు తూర్పు రష్యాలో శిక్షణ పొందుతున్నారని ఉక్రెయిన్‌ వర్గాలు ఇటీవల తెలిపాయి. శిక్షణ అనంతరం నవంబరు మొదటి వారంలో వీరు కదన రంగంలోకి దిగినట్లు అంచనా. ఈ క్రమంలోనే కిమ్‌ సేన ఇంటర్నెట్‌ వినియోగంపై ఇటువంటి వార్తలు రావడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.