Viral Video: వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
సాధారణంగా పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తుంటాం. మరికొందరికి ఆ పదం వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఒకేసారి కట్టల కొద్ది పాములను చూస్తే.. కుప్పలు తెప్పలుగా డబ్బాల్లోనూ, బస్తాల్లోనూ కనిపిస్తే..! ఎస్.. ఇదిగో ఈ స్నేక్ క్యాచర్ చేతిలో కట్టలు కట్టలుగా కనిపిస్తున్నాయి చూశారుగా.? వారం రోజుల వ్యవధిలో వేరువేరు చోట్ల పట్టిన పాములు ఇవన్నీ..!
అత్యంత విషపూరితమైన ఎనిమిది నాగుపాములు.. మరో 8 ర్యాట్ స్నేక్స్.. మరో మూడు పొడ పాములు..! ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా..? ఇవన్నీ విశాఖ సిటీలో పట్టుబడినవే. అవి కూడా వారం రోజుల వ్యవధిలోనే..! దీపావళి నాటి నుంచి వేర్వేరు చోట్ల జనావాసాల్లోకి వస్తూ.. హడలెత్తించిన ఈ పాములను పట్టుకుంది స్నేక్ సేవ సొసైటీ కిరణ్ అండ్ టీం. వేర్వేరు చోట్ల ఇళ్లల్లో, మరికొన్ని జనావాస ప్రాంతాల్లోకి వచ్చేసాయి ఈ సర్పాలు.
విశాఖలో స్నేక్స్ సేవర్ సొసైటీ టీం స్థానికులకు పాముల భయం నుంచి ఊరట కల్పిస్తుంది. స్నేక్ క్యాచర్ కిరణ్ నేతృత్వంలోనే ఈ బృందం.. సిటీలో కనిపించే ఏ సర్పాన్నైనా చాకచక్యంగా పట్టేస్తూ ఉంటారు. ఒక్క కాల్ కొడితే చాలు.. వచ్చి వాలిపోయి చాకచక్యంగా పామును బంధిస్తూ ఉంటారు. పట్టుకున్న వాటిని సంరక్షించి సుదూర ప్రాంతాల్లోనే పొదలు అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. పాములకు ఏవైనా గాయాలైన.. వాటిని పశు వైద్యుల వద్దకు తీసుకెళ్లి సపర్యలు కూడా చేస్తారు. ఆరోగ్యకరంగా ఉన్న పాములను అటవీ శాఖ సూచనల మేరకు.. శివారులోని పొదల్లో పట్టుకున్న పాములను సేఫ్ గా విడిచిపెడుతున్నారు.
ఈ మధ్యకాలంలో.. స్నేక్స్ సేవర్ సొసైటీ సభ్యులు భారీగానే పాములు పట్టుకున్నారు. కేవలం వారం వ్యవధిలోనే.. జెర్రి గుడ్లు, నాగుపాములు, పొడ పాములను క్యాచ్ చేశారు. జనావాసాల గుబులు పుట్టిస్తున్న పాములన్నిటిని పట్టుకొని బంధించారు. కట్టలు కట్టలుగా ఒకచోట చేర్చి వాటిని విడిచి పెడుతున్నారు. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకుంటున్నారు విశాఖ జనం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.