ఓరీ దేవుడో ఏం తినేటట్టు లేదు..! ప్రముఖ బ్రాండ్ బిస్కెట్‌ప్యాకెట్‌ ఓపెన్‌ చేసిన అమ్మాయిలు పరుగో పరుగు..

దీంతో బిస్కెట్లను తిరిగి ప్యాకెట్‌లో పెట్టి మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశారు. వీడియోతో పాటు క్యాప్షన్‌గా ఇషికా ఇలా రాశారు..ఈ బిస్కెట్‌ రుచి ఎంత బాగుంటుందో.. దాన్ని తినేముందు అంత జాగ్రత్తగా ఉండాలని రాశారు. ఇంత పెద్ద బ్రాండెడ్‌ కుకీలు కూడా పురుగులుపట్టి ఉంటే, ఎవరిని నమ్మాలో తెలియటం లేదంటూ ఆమె వాపోయారు.

ఓరీ దేవుడో ఏం తినేటట్టు లేదు..! ప్రముఖ బ్రాండ్ బిస్కెట్‌ప్యాకెట్‌ ఓపెన్‌ చేసిన అమ్మాయిలు పరుగో పరుగు..
Unibic Foods
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 12, 2024 | 9:26 AM

గత కొద్ది రోజులుగా ఫుడ్‌ సెఫ్టీకి సంబంధించి అనేక షాకింగ్‌ వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తినే ఆహారం, తాగే పానీయాలలో క్రిమికీటకాలు కనిపించడం సాధారణ విషయంగా మారింది. ఐస్‌క్రీమ్‌లో పురుగులు, బర్గర్‌లో పురుగులు, సమోసాలో మనిషి వేళ్లు, కప్ప కళేబరం బయటపడుతున్న సంఘటనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పాడైపోయిన, కుళ్లిపోయిన, పురుగుల ఆహారాలను ప్రజలకు అందిస్తున్న పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఎప్పటికప్పుడు, నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయినా ఇలాంటి కేసులు ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బిస్కెట్లలో క్రిములు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన ఓ యువతి కొనుగోలు చేసిన ఓ బిస్కెట్‌ ప్యాకెట్‌ను తెరిచి చూడగా అందులో పురుగు సంచరిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇషికా జైన్ అనే అమ్మాయి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ ఫేమస్‌ బ్రాండ్‌ బిస్కెట్‌ ప్యాకెట్‌ని తెరిచి చూడగా బిస్కెట్‌లో పురుగు కనిపించిందని ఇషికా చెప్పింది. అనంతరం బిస్కెట్లను తిరిగి ప్యాకెట్‌లో పెట్టి మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశారు. వీడియోతో పాటు క్యాప్షన్‌గా ఇషికా ఇలా రాశారు..ఈ బిస్కెట్‌ రుచి ఎంత బాగుంటుందో.. దాన్ని తినేముందు అంత జాగ్రత్తగా ఉండాలని రాశారు. ఇంత పెద్ద బ్రాండెడ్‌ కుకీలు కూడా పురుగులుపట్టి ఉంటే, ఎవరిని నమ్మాలో తెలియటం లేదంటూ ఆమె వాపోయారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇంత ఫేమస్ బ్రాండ్ అజాగ్రత్తగా వ్యవహరిస్తోందంటే, ఇతర కంపెనీల గురించి ఏం చెప్పగలం అంటున్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ను అభ్యర్థించామని మరొకరు రాశారు. ఇప్పుడు పిజ్జా, బర్గర్‌, ఐస్‌క్రీమ్‌లో ఏది పడితే అది దొరుకుతున్నప్పుడు, బిస్కెట్‌లో పురుగులు ఉండటం పెద్ద విషయం ఏం కాదని మరొకరు ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే