AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: బాలీవుడ్ నే భయపెడుతున్న బన్నీ.! ఇండియా రేంజ్‌లో భారీ హైప్‌..

Pushpa 2: బాలీవుడ్ నే భయపెడుతున్న బన్నీ.! ఇండియా రేంజ్‌లో భారీ హైప్‌..

Anil kumar poka
|

Updated on: Nov 12, 2024 | 12:40 PM

Share

పుష్పరాజ్‌ మేనియా బాలీవుడ్ మేకర్స్‌ను కూడా భయపెడుతోంది. ఇంకా సీరియస్‌గా ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయకముందే పుష్ప 2ని చూసి నార్త్ మేకర్స్ భయపడుతున్నారు. తొలి భాగం ఘన విజయం సాధించటం సీక్వెల్ రిలీజ్ విషయంలో మేకర్స్‌ ప్లానింగ్ చూసి, బన్నీతో పోటికి దిగాలనుకున్న హీరోలు.. పుష్ప 2 మీద పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హైప్‌ ఉంది. తొలి భాగం నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్‌ మీద కూడా బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ ఛావా. ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు మేకర్స్‌. కానీ సడన్‌గా పుష్పరాజ్‌ అదే సీజన్‌లో బరిలో దిగేందుకు రెడీ అవ్వటంతో ఛావా మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ముందు పుష్ప 2తో క్లాష్‌ను లైట్‌ తీసుకున్న నార్త్ మేకర్స్‌కు నెమ్మదిగా టెన్షన్‌ మొదలైంది. పుష్ప 2ను ప్రపంచ వ్యాప్తంగా 11500 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే అదే టైమ్‌లో మరో భారీ సినిమాకు థియేటర్ల దొరకటం చాలా కష్టం. అందుకే ఛావా మేకర్స్ రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి పోస్ట్‌పోన్‌ చేయటం విషయంలో నిర్ణయం తీసుకోకపోయినా.. ఛావా టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవటంతో పుష్ప 2తో క్లాష్ ఉండకపోవచ్చన్న టాకే వినిపిస్తొంది. ఈ అప్‌డేట్స్‌తో బన్నీ ఫ్యాన్స్‌.. ‘అది పుష్పరాజ్‌ రేంజ్‌’ అంటూ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం , అల్లు అర్జున్, రష్మిక మందన్న, నవంబర్ మధ్యలో 6-నగరాల విస్తృత ప్రచార పర్యటనను స్టార్ట్ చేయబోతున్నారు , నవంబర్ 15న జరిగే ప్రధాన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రారంభమవుతుంది. మొదటి స్టాప్ పాట్నాలో ఉంటుందని భావిస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, మరియు కొచ్చిలలో గ్రాండ్ ఈవెంట్స్ తరువాత. పుష్ప 2 అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ, దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. పుష్ప 2 బృందం ఈ పర్యటనతో భారతదేశం మొత్తాన్ని కవర్ చేయాలని...

Published on: Nov 12, 2024 09:14 AM