హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ నిబంధనలు కచ్చితంగా చుడండి.. 

TV9 Telugu

02 January 2025

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మీరు ఎంచుకునే పాలసీకి సంబంధించిన అన్ని నిబంధనలు కచ్చితంగా తెలుసుకోవాలి.

ముందుగా డాక్యుమెంట్ లో అన్ని నిబంధనలు క్లుప్తంగా వివరించే కీ డెఫినిషన్ విభాగాన్ని చదవాలి. తరువాత ఈ విభాగాలు క్షుణ్ణంగా చదివి అర్ధం చేసుకోవాలి.

కవరేజ్ వివరాలు ఉండే విభాగంలో ఆ పాలసీలో కవర్ అయ్యే వ్యాధులు - వెయిటింగ్ పిరియడ్ పై అన్ని విషయాలు వివరంగా ఉంటాయి.

కవరేజ్ వివరాలు ఉండే విభాగంలో ఆ పాలసీలో కవర్ అయ్యే వ్యాధులు - వెయిటింగ్ పిరియడ్ పై అన్ని విషయాలు వివరంగా ఉంటాయి.

మీ పాలసీలో వచ్చే యాడ్స్ అండ్ ఎక్సమ్షన్స్ విభాగాన్ని చెక్ చేయాలి. ఇక్కడ మీ పాలసీలో కవర్ అయ్యే అంశాలు.. కవర్ కానీ అంశాలు అన్నిటినీ కంపెనీ ఇస్తుంది.

మరొక ముఖ్యమైన విభాగం పాలసీ పరిమితులు. ఈ విభాగంలో, నిర్దిష్ట సేవ లేదా చికిత్స కోసం బీమా కంపెనీ చెల్లించే గరిష్ట మొత్తాన్ని మీరు చూడొచ్చు.

ఇవి సాధారణంగా రూమ్ రెంట్, అంబులెన్స్ కవర్, ఆసుపత్రిలో చేరే ముందు అలాగే పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులపై వర్తిస్తాయి.

మీ పాలసీకి కోపేమెంట్ నిబంధన ఉందో లేదో ప్రత్యేకంగా గమనించండి. కోపేమెంట్అంటే బీమా సంస్థ మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని మాత్రమే చెల్లించడానికి అంగీకరిస్తుంది.