PM Vishwakarma Yojana: ఏడాదిలోనే PM విశ్వకర్మ యోజన పథకం రికార్డ్‌.. ఎంతమందికి ప్రయోజనం చేకూరిందంటే?

విశ్వకర్మ పూజ సందర్భంగా ప్రధాని మోదీ తన పుట్టినరోజు 17 సెప్టెంబర్ 2023న ప్రారంభించిన విశ్వకర్మ యోజన ఇప్పటివరకు వివిధ పని రంగాల్లోని 23 లక్షల మంది కళాకారులకు ప్రయోజనం చేకూర్చింది.

PM Vishwakarma Yojana: ఏడాదిలోనే PM విశ్వకర్మ యోజన పథకం రికార్డ్‌.. ఎంతమందికి ప్రయోజనం చేకూరిందంటే?
Pm Vishwakarma Yojana
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 12, 2024 | 12:45 PM

భారత్‌ను ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా నిలపాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం ఒక్కొక్కటిగా నెరవేరుతోంది. మేడిన్‌ ఇండియా పథకంలో భాగంగా అన్ని రంగాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు నరేంద్ర మోదీ. హస్తకళాకారుల సంప్రదాయ నైపుణ్యాల సాధనను ప్రోత్సహించడంలో, బలోపేతం చేయడంలో ఈ పథకం సహాయపడుతుంది. ఇది హస్తకళాకారులకు ఉత్పత్తులు, సేవలను సరిగ్గా అందించడంలో కూడా సహాయపడుతుంది. దీంతోపాటు నైపుణ్య శిక్షణ, లబ్దిదారునికి ఆర్థికస్వాలంభన సాధించేలా ఈ పథకాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.

విశ్వకర్మ పూజ సందర్భంగా ప్రధాని మోదీ తన పుట్టినరోజు 17 సెప్టెంబర్ 2023న ప్రారంభించిన విశ్వకర్మ యోజన ఇప్పటివరకు వివిధ పని రంగాల్లోని 23 లక్షల మంది కళాకారులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీ రేటుతో విశ్వకర్మ రుణం , నైపుణ్య శిక్షణ, 18 విభిన్న రంగాలకు చెందిన కళాకారులకు పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. విశ్వకర్మ యోజన ఇప్పటివరకు చాలా సమర్థవంతమైన సామాజిక సంక్షేమ పథకంగా నిరూపితమైంది. ఈ పథకంలో, వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం చౌక వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తుంది. సంప్రదాయ నైపుణ్యాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల రుణం అందజేస్తుంది. ఈ పథకంలో, రుణంతో పాటు, లబ్ధిదారునికి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 11లక్షల మంది సాంప్రదాయ కళాకారులు 11లక్షల మంది లబ్ధిపొందారు.

ఇందులో వడ్రంగి, పడవ బిల్డర్లు, కమ్మరి, తాళాలు వేసేవారు, గోల్డ్ స్మిత్, కుండల తయారీదారు (కుమ్మరి), శిల్పి, తాపీ మేస్త్రీ, చేపలు పట్టేవారు, రాయి కొట్టేవారు, చెప్పులు కుట్టేవారు, బుట్ట, చాప, చీపురు తయారీదారులు, బొమ్మల తయారీదారులు, బార్బర్, పూల దండలు తయారు చేసేవారు, చాకలివారు, దర్జీ వంటి సాంప్రదాయ వృత్తుల వారు ఉన్నారు. అయితే ఇందులో 40% మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. శిక్షణ పొందిన వారిలో 5.8లక్షల మంది ఇతర వెనుకబడిన తరగతులకు, 1.9లక్షలకు పైగ షెడ్యూల్‌ కులాలకు, 87.614 మంది షెడ్యూల్‌ తెగలకు చెందిన వారికి ప్రయోజనం చేకూరినట్లు నెపుణ్యాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకం లబ్ధిపొందినవారిలో కర్ణాటకలో అత్యధికంగా 1.1లక్షల మంది సర్థిఫైడ్‌ అభ్యర్థులు ఉన్నారు. ఆ తర్వత జమ్మూ కాశ్మీర్‌లో 82,514 మంది, గుజరాత్‌లో 82,542 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు రూ. 551.8 కోట్ల రుణాలు మంజూరు చేయగా, రూ. 132.4 కోట్లు లబ్దిదారులకు అందజేయం జరిగింది.

దరఖాస్తు ప్రక్రియ ఏమిటి?

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి (pmvishwakarma.gov.in).

ఆన్‌లైన్‌లో ఎంచుకుని, రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ కోసం మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి,

ఆ తర్వాత మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది.

ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

ఫారమ్ నింపిన తర్వాత, పత్రాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.

పత్రాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత, అన్ని వివరాలను మరోసారి క్రాస్ చెక్ చేసి సమర్పించండి.

సంబంధిత అధికారులు పరిశీలించి మిమ్మలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..