CM Revanth Reddy: హైదరాబాద్ టూ ముంబై వయా ఢిల్లీ.. అసలు ప్లాన్ అదేనా!
తెలంగాణలో విజయవంతమైన ప్రచార విధానాలను మహారాష్ట్రలో కూడా అనుసరించాలని మహా అఘాడి నేతలు నిర్ణయించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లారు.. మంగళవారం(నవంబర్ 12) సాయంత్రం ఢిల్లీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రేపు బుధవారం ఉదయం నేరుగా మహారాష్ట్రలో జరిగే ముఖ్యమైన సమావేశంలో పాల్గొననున్నారు.
మహారాష్ట్రలో కీలక సమావేశం
రేపు(మంగళవారం) మహారాష్ట్రలో మహా అఘాడి నేతలతో ముఖ్యమైన సమావేశం జరగనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ తరహాలో ప్రచారం నిర్వహించేందుకు వ్యూహాలను సిద్ధం చేయాలని మహా అఘాడి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ మహారాష్ట్ర పర్యటన ఖరారు అయ్యింది.
తెలంగాణలో విజయవంతమైన ప్రచార విధానాలను మహారాష్ట్రలో కూడా అనుసరించాలని మహా అఘాడి నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మహారాష్ట్రలోని మహా అఘాడి కూటమి నేతలకు ప్రచార వ్యూహాలను వివరిస్తారు. మహారాష్ట్రలో ర్యాలీలు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లకు సంబంధించిన కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర నేతలకు వివరించనున్నారు.
సీఎం క్రేజ్ ఉపయోగించుకోవాలని నిర్ణయం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ మహారాష్ట్రలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు అఘాడీ నేతలు. ఈ మేరకు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో వ్యూహాలపై చర్చిస్తున్నారు. అటు హై కమాండ్ కూడా రేవంత్ సూచనలు తీసుకోవాలని ఆదేశించిందట. దీంతో రేపు మహా వ్యూహాల పై కీలక సమావేశం నిర్వహించి రేవంత్ సూచనలు తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది పార్టీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..