AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరేం మనుషులురా సామీ..! శవాన్ని ముందు పెట్టుకుని ఆస్తి వాటాలేసుకున్నారు..!

వృద్ధురాలు చనిపోగా.. ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిలిపివేశారు. ఆస్తి పంపకాలు అయిన అనంతరం మరుసటి రోజు దహన సంస్కారాలు చేశారు వారి కుటుంబ సభ్యులు.

మీరేం మనుషులురా సామీ..! శవాన్ని ముందు పెట్టుకుని ఆస్తి వాటాలేసుకున్నారు..!
Old Woman
P Shivteja
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 12, 2024 | 11:18 AM

Share

ఆస్తి కోసం మానవత్వాన్ని మంటగలుపుతున్నారు కొంతమంది. అన్నదమ్ములు, తండ్రీకొడుకుల అనుబంధం, ఆప్యాయతలు ఇవన్నీ ఆస్తి, డబ్బు ముందు దిగదుడుపు అవుతున్నాయి. మనిషి చనిపోయిన సరే..! తమకు ఆమె ఆస్తినే ముఖ్యం అని నిరూపిస్తున్నారు కొంతమంది. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

వృద్ధురాలు చనిపోగా.. ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిలిపివేశారు. ఆస్తి పంపకాలు అయిన అనంతరం మరుసటి రోజు దహన సంస్కారాలు చేశారు వారి కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు వంగ కిష్టవ్వ(90) అనారోగ్యంతో ఆదివారం(నవంబర్‌ 10) మధ్యాహ్నం చనిపోయింది. ఆమెకు ముగ్గురు కొడుకులు నారాయణ, రాజేశం, రామ్ శంకర్, కూతురు కళావతి ఉన్నారు. వీరిలో నారాయణ, రామ్, శంకర్ కొన్నేండ్ల కిందటే చనిపోయారు.

అయితే, 30 లక్షల రూపాయల విలువైన ఇంటిని కొంతకాలం కింద రెండో కొడుకు రాజేశం తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని మిగతా ఇద్దరు కొడుకుల పిల్లలు పెద్ద మనుషుల్లో పెట్టగా దీనిపై ఇప్పటికీ పంచాయితీ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రోజు కిష్టవ్వ ఆరోగ్యం క్షిణించి మృతి చెందింది. అయితే ఆ ఇంటిని మూడు వాటాలుగా పంచిన తర్వాతే కిష్టవ్వ అంత్యక్రియలు చేయాలని పట్టుపట్టి అడ్డుకున్నారు మిగిలిని కుటుంబసభ్యులు.

వృద్ధురాలి కూతురు, ఇతర బంధువులు ఈ విషయాన్ని గమనించిన కుల సంఘం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు అందుకూ ససేమిరా అనడంతో.. ఆస్తిని పంచాలని నిర్ణయం తీసుకున్నారు కుల పెద్దలు. దానితో ఆస్తిని పంచుకునేందుకు ఒప్పుకుని, అడ్వకేట్ సమక్షంలో నోటరీ చేయించారు. ఇదంతా పూర్తయ్యేందుకు ఒకరోజు పట్టింది. దీంతో కిష్టవ్వ అంత్యక్రియలు సోమవారం పూర్తి చేశారు. ఈ హృదమవిదారకర ఘటనను చూసి గ్రామస్తులు అందరూ ముక్కున్న వేలు వేసుకున్నారు..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..