Rice Water: బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగాలు..
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నానికే పెద్ద పీట వేస్తారు. అయితే అన్నం వండేముందు బియ్యాన్ని కడగటం సహజం. బియ్యం కడిగిన నీటిని సింపుల్ గా సింకులో పోసేయడం అందరూ చేసే పనే.. బియ్యం కడిగిన నీరు సహజంగా మబ్బుగా ఉంటుంది. అయితే ఈ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఈ నీటిని సింకులో పడేయకుండా వీటిని తిరిగి ఉపయోగించడం వల్ల వివిధ లాభాలు కూడా చేకూరతాయి.
బియ్యం కడిగిన నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. షాంపూతో తల స్నానం చేసిన తరువాత జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. బియ్యం కడుగులో ఉండే పోషకాలు జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం తగ్గుతుంది. జుట్టుకు మెరుపు కూడా వస్తుంది. వారానికి రెండు సార్లు ఇలా చేస్తుంటే జుట్టులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
బియ్యం నీరు చర్మానికి టోనర్ గా పనిచేస్తుంది. మొదట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక కాటన్ బాల్ ను బియ్యం నీటిలో ముంచి ముఖమంతా అప్లై చేయాలి. బియ్యం నీటిలో పోషకాలు ముఖ చర్మ రంధ్రాలను బిగించి ముడుతలు లేకుండా చేస్తాయి. చర్మానికి నేచురల్ మెరుపును ఇస్తాయి. దీంతో మరింత మంచి ఫలితాలు కావాలంటే బియ్యం నీటిని 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచి వాడవచ్చు. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. పొడ చర్మం ఉన్నవారికి బియ్యం నీరు మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. స్నానానికి సిద్దం చేసుకునే నీటిలో కొంచెం బియ్యం నీరు కలపాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత స్నానం చెయ్యాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

