AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit: న్యూస్9 సమ్మిట్‌లో గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్‌ ప్రదానం.. ఏయే రంగాల వారికంటే..

టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమవుతోంది.. భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ జర్మనీలోని స్టుట్‌గార్ట్ వేదికగా నవంబర్ 21 నుంచి 23 వరకు జరగనుంది. బాడెన్-వుర్టెంబర్గ్ రాజధాని స్టుట్‌గార్ట్‌లోని MHP అరేనా స్టేడియంలో జరిగే ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా కీలక ప్రసంగం చేయనున్నారు.

News9 Global Summit: న్యూస్9 సమ్మిట్‌లో గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్‌ ప్రదానం.. ఏయే రంగాల వారికంటే..
News9 Global Summit
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Nov 20, 2024 | 5:50 PM

Share

టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమవుతోంది.. భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ జర్మనీలోని స్టుట్‌గార్ట్ వేదికగా నవంబర్ 21 నుంచి 23 వరకు జరగనుంది. బాడెన్-వుర్టెంబర్గ్ రాజధాని స్టుట్‌గార్ట్‌లోని MHP అరేనా స్టేడియంలో జరిగే ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా కీలక ప్రసంగం చేయనున్నారు. TV9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరుణ్‌ దాస్‌ అధ్యక్షతన జరిగే భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ లో ఇరు దేశాల మధ్య మైత్రీ, వాణిజ్య సంబంధాలు, భాగస్వామ్యంపై కీలక చర్చ జరగబోతుంది. ఇండియా – జర్మనీ సుస్థిర అభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలు, ఉద్యోగ -ఉపాధి తదిర అంశాలపై జరిగే ఈ సమ్మిట్ లో రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొని వారి అభిప్రాయాలను పంచుకోనున్నారు.

భారత్ – జర్మనీ ప్రభుత్వాల మధ్య చొరవలను ప్రోత్సహించే లక్ష్యంతో న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రసంగించనున్నారు. అంతేకాకుండా.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శిఖరాగ్ర సమావేశంలో నేరుగా పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఇరు దేశాల భాగస్వామ్యం నైపుణ్యాలను పంచుకోవడం – టెక్నాలజీ అభివృద్ధిపై చర్చ నిర్వహించనున్నారు.

TV9 నెట్‌వర్క్ ఫ్లాగ్‌షిప్ కాన్క్లేవ్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ విజయవంతం అయిన తర్వాత నెట్‌వర్క్ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ లో గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ ను అందజేయనున్నారు. పలు రంగాల్లో పలువురు చేసిన విశేష సేవలు, కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేయనుంది.. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్‌మెంట్, బిజినెస్, స్పోర్ట్స్ రంగాల్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో భారతదేశపు మొట్టమొదటి రికార్డింగ్ ఆర్టిస్ట్ గౌహర్ జాన్ ను అంకితమిస్తూ మ్యూజికల్ నైట్ ను నిర్వహించనున్నారు.

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ మూడు రోజుల కార్యక్రమాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!