Best cars under 10 lakhs: తక్కువ ధరలో అదిరే ఫీచర్లు.. పది లక్షల్లోపు దొరికే బెస్ట్ కార్లు ఇవే..!
కారు కొనుగోలు చేయాలనుకునే వారందరూ వాటి ధరలను చూసి కొంచెం భయపడతారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో బడ్జెట్ ప్రధాన విషయంగా మారుతుంది. తమ స్థోమతకు తగిన విధంగా దొరికే కారు కోసం ఎదురు చూసేవారు చాలామంది ఉంటారు.
మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ధరలో కార్లు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ప్రముఖ కంపెనీలకు చెందిన మోడళ్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రూ.పది లక్షల ధరలో అందుబాటులో ఉన్న కార్లు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.
మారుతీ సుజుకి డిజైర్
ఆధునీకరించిన నాలుగో తరం మారుతీ సుజుకీ డిజైర్ ఎంతో ఆకట్టుకుంటోంది. మునుపటి కంటే సొగసైన లుక్‌తో కనిపిస్తోంది. దీనిలో 1.2 లీటర్ మూడు సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. సింగిల్ ఫేస్ సన్ రూఫ్, తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, ఆరు ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. పెట్రోలు, సీఎన్‌జీ ఇంధన ఎంపికలతో అందుబాటులో ఉంది.
హోండా అమేజ్
హోండా సిటీ కారును పొలి ఉండే అనేక డిజైన్ మార్పులతో కొత్త అమేజ్ అందుబాటులోకి వచ్చింది. కారు క్యాబిన్‌లో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్ ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కిప్ అసిస్ట్ టెక్నాలజీతో కూడిన ఏడీఏఎస్ సూట్ అదనపు ప్రత్యేకతలు. సబ్ కాంపాక్ట్ సెడాన్ కేటగిరీలోని ప్రముఖ కారు ఇది.
మారుతీ సుజుకి స్విఫ్ట్
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతీ సుజుకి స్విఫ్ట్ ప్రముఖంగా ఉంటుంది. ఈ మోడల్ లోని నాలుగో వెర్షన్ 2024లో విడుదలైంది. కొత్త డిజైన్, విస్తృత శ్రేణి ఫీచర్లు, అప్‌గ్రేడ్ చేసిన ఇంజిన్‌తో వస్తుంది. నాలుగు సిలిండర్ల పెట్రోలు మోటారుకు బదులుగా మూడు సిలిండర్ల ఇంజిన అమర్చారు. దీనికి సీఎన్‌జీ పవర్ ట్రెయిన్ కూడా లభిస్తుంది.
హ్యూందాయ్ ఎక్స్‌టర్
లేటెస్ట్ ఫీచర్లతో, తక్కువ ధరకు లభించే కార్లలో హ్యందాయ్ ఎక్స్‌టర్ ఒకటి. ఈ ఎస్‌యూవీ అనేక రకాల ఫీచర్లు, పవర్ ట్రయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. దీని ధర రూ.పది లక్షల కంటే తక్కువే. ఆ ధరకు కారు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి హ్యందాయ్ ఎక్స్‌టర్ మంచి చాయిస్.
టాటా పంచ్
దేశంలో విడుదలైన అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందిన కార్లలో టాట పంచ్ ముందు వరుసలో ఉంటుంది. పెట్రోలు, పెట్రోలు-సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది. నగరాలతో పాటు జాతీయ రహదారులపై ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం రూ.పది లక్షల లోపు ధరలో పెట్రోలు వెర్షన్ టాటా పంచ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి