రోజూ మనం చాలా చోట్ల డబ్బులు ఖర్చు పెడుతుంటాం. ఆన్లైన్.. యూపీఐ ద్వారా సులభంగా పేమెంట్స్ చేసేస్తూ ఉంటాం.
మనకి చాలా వస్తువులు 499.. 569.. 386 ఇలాంటి ధరల్లో దొరుకుతాయి. అంతవరకూ మనం పేమెంట్ చేసేస్తాం. కానీ.. వీటిని రౌండాఫ్ చేస్తే.. అంటే 499 ని 500 కి.. 569 ని 600 కి, 386 ని 400 కి ఎలా ఉంటుంది.
ఈ రౌండాఫ్ ఎందుకు అంటారా? పైన చెప్పిన ఖర్చు మీరు ఒకరోజు చేస్తే.. రౌండాఫ్ చేసిన డబ్బుతో ఈ ఖర్చు తీసేస్తే 47 రూపాయలు మిగులుతాయి. దీనినే మనం సాధారణంగా చిల్లర డబ్బు అంటాం.
ఇప్పుడు ఈ చిల్లర డబ్బు ఇన్వెస్ట్ చేస్తే.. అలా మనం డబ్బు ఖర్చు పెట్టినప్పుడల్లా మిగిలే ఇలాంటి చిల్లర డబ్బును ఒకచోట చేర్చి.. ఇన్వెస్ట్మెంట్ లో పెడితే మనకు తెలియకుండానే మంచి ఫండ్ పోగవుతుంది.
ఖర్చుల లెక్కలన్నీ చూసి.. వాటినుంచి చిల్లర ఎంతుందో లెక్కేసి.. దానిని ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ పనంతా మనవల్ల ఎక్కడవుతుంది అనుకుంటున్నారా?
మీకాశ్రమ అక్కర్లేకుండా చాలా యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అవి మీరోజు వారి ఖర్చులను ట్రాక్ చేస్తాయి. మీరు ఖర్చు చేసిన ప్రతి ఖర్చు నుంచి మిగిలిన చిల్లర ఎంతో చెబుతుంది.
ఆ చిల్లర డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా? అని అడుగుతుంది. చేయి అని చెబితే చాలు ఆ యాప్ లో అందుబాటులో ఉన్న ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తుంది.
అప్రిషియేట్, జార్ - నియో వంటి ఫిన్‌టెక్ కంపెనీల నుంచి ఈ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ స్టోర్ నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీరు యాప్‌లో సేవింగ్స్ ఎకౌంట్ ఓపెన్ చేయాలి లేదా యాప్‌కి మీ బ్యాంక్ ఎకౌంట్ ను లింక్ చేయాలి. ఆ తరువాత మీరు ఏ విధమైన సూచనలు ఇస్తే అదే విధంగా ఈ యాప్స్ ఇన్వెస్ట్ చేస్తాయి.
చినుకు.. చినుకు వానైనట్టు.. చిల్లర డబ్బులు కొన్నాళ్ళకి అత్యవసరం ఉపయోగపడే కొద్దిపాటి మొత్తాన్ని మీకు సమకూరుస్తాయి.