ఒక్క సెకనులో అకౌంట్‌ నుంచి రూ.6 లక్షలు మాయం.. షాక్‌లో యువకుడు

31 December 2024

Subhash

కర్ణాటకలో డిజిటల్ మోసానికి ఓ యువకుడు అక్షరాల 6.6 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపింది. 

డిజిటల్ మోసం

యువకుడు వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయగా, అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6 లక్షలను మోసం చేసిన ముఠా డ్రా చేసేసింది.

వాట్సాప్ లింక్‌పై

ఇలాంటివి అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ డిజిటల్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

డిజిటల్ మోసాలు

బాధితుడికి కెనరా బ్యాంక్ అనే వాట్సాప్ గ్రూప్‌లో లింక్ వచ్చింది. APK ద్వారా ఆధార్, కేవైసీ అప్‌డేట్ చేయకపోతే, కెనరా బ్యాంక్ ఖాతా బ్లాక్ చేయబడుతుందని బాధితుడికి సందేశం వచ్చింది. 

కెనరా బ్యాంక్

దానితో పాటు ఒక లింక్ కూడా వచ్చింది. ఆ వార్తను నిజమని నమ్మిన ఆ యువకుడు ఏపీకే డౌన్‌లోడ్ చేశాడు. 

ఒక లింక్

అందులో నకిలీ కెనరా బ్యాంక్ లింక్ కనిపించింది. ఆధార్ నంబర్, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్ తదితర వ్యక్తిగత వివరాలను కోరింది. వెంటనే ఆ యువకుడు వివరాలన్ని ఇచ్చేశాడు

లింక్

ఆ తర్వాత అతనికి ఓటీపీ వచ్చింది. కానీ అతను ఆ OTPని ఎవరితోనూ పంచుకోలేదు. అతను ఏమీ ఇన్‌పుట్ చేయలేదు.

ఓటీపీ 

అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.6.6 లక్షల లావాదేవీ జరిగినట్లు తెలిసింది. ఇది మోసమని గ్రహించిన యువకుడు వెంటనే కావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

రూ.6.6 లక్షలు