Nuvvostanante Nenoddantana: తస్సాదియ్యా.. ఏం ఉంది గురూ.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్యూటీ గుర్తుందా..?

తెలుగులో మోస్ట్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చిత్రాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. ఇప్పటికీ ఈ సినిమాకు సేపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ చిత్రాల్లోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ మూవీ సాంగ్స్ సైతం వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. గుర్తుందా..?

Nuvvostanante Nenoddantana: తస్సాదియ్యా.. ఏం ఉంది గురూ.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా బ్యూటీ గుర్తుందా..?
Nuvvostanante Nenoddantana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2025 | 8:55 PM

టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన త్రష కథానాయికగా నటించింది. ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ జనాలను ఆకట్టుకుంది. ఇందులో శ్రీహరి, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, అర్చన కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 2005లో చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించగా.. ఈ సినిమాతో సిద్దార్థ్, త్రిష క్రేజ్ మారిపోయింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను దాదాపు చాలా భాషలలో రీమేక్ చేశారు. ఏకంగా తొమ్మిది భాషలలోకి రీమేక్ అయిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇక సునీల్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇందులో సిద్ధార్థ్ వెంటపడే అమ్మాయిగా గ్లామర్ లుక్ లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. నందిత జెన్నిఫర్.

తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మెప్పించింది. ఆమెకు ఇదే మొదటి సినిమా. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగులో కాకుండా తమిళంలో వరుస ఆఫర్స్ అందుకున్న నందితా.. అక్కడే సెటిల్ అయ్యింది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. 2007లో కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Jeni_Chinna (@jenniferr252)

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.