Game Changer: సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్.. గ్లోబల్ స్టార్ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది . ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీటిని రెట్టింపు చేసేలా గురువారం (జనవరి 02) గేమ్ ఛేంజర్ ట ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Game Changer: సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్.. గ్లోబల్ స్టార్ మూవీ రన్ టైమ్ ఎంతంటే?
Game Changer Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2025 | 8:44 PM

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం (జనవరి 02)న గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గ్లోబల్ స్టార్ నటన అద్దిరిపోయిందని, డైలాగులు కూడా బాగా పేలాయని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. అలాగే అప్పన్న అనే రాజకీయ నాయకుడిగానూ అలరించనున్నాడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఈ ట్రైలర్ నిదర్శనం. కాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పొలిటికల్ యాక్షన్ ‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఇక సినిమా నిడివి 165.30 నిమిషాల (2:45 గంటలు) ఉండనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి, ఎస్.జె. సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రా మచ్చా, నానా హైరానా, జరగండి, ధోప్ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక కొన్ని గంటల క్రితమే రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా నెక్ట్స్ లెవెల్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్.

గేమ్ ఛేంజర్ సెన్సార్ రిపోర్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .