Honda EVs: హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేశారా..? త్వరపడకుంటే మీకు నిరాశ తప్పదంతే..!

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోాటార్ స్కూటర్ ఇండియా (హోండా) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ విభాగంలోకి ప్రవేశించింది. వాహన ప్రియుల ఎదురు చూపులకు తెరదించుతూ రెండు ఈవీలను ఆవిష్కరించింది. యాక్టివా ఈ, యాక్టివా క్యూసీ1 పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వీటి బుక్కింగ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి నుంచి వాహనాల డెలివరీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రత్యేకతలు తెలుసుకుందాం.

Honda EVs: హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేశారా..? త్వరపడకుంటే మీకు నిరాశ తప్పదంతే..!
Honda Ev Scooter
Follow us
Srinu

|

Updated on: Jan 02, 2025 | 4:45 PM

స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా నెలకొల్పిన రికార్డులు అందరికీ తెలిసినవే. స్కూటర్ అంటే యాక్టివా అనే స్థాయిలో జోరుగా విక్రయాలు జరిగాయి. ఫ్యామిలీ స్కూటర్ గా అందరి అభిమానం పొందింది. ఇప్పటికీ ఆ విభాగంలో నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిన నేపథ్యంలో వివిధ కంపెనీలు ఈవీలను విడుదల చేశాయి. హోండా కంపెనీ కొంచెం ఆలస్యంగా దీనిలో చేరినా, ఈ రెండు స్కూటర్లతో మార్కెట్ ను తనవైపు తిప్పుకుంటోంది. హోండా యాక్టివా ఈ స్కూటర్ ను బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని కంపెనీ డీలర్ల షాపులలో రూ.వెయ్యి చెల్లించి బుక్కింగ్ చేసుకోవచ్చు. హోండా క్యూసీ1 ఈవీ ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ఛండీగఢ్ లోని అథరైజ్డ్ డీలర్ల షాపుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు స్కూటర్లను 2024 నవంబర్ లో ఆవిష్కరించారు. అయితే జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో వీటిని ధరలను వెల్లడిస్తారు.

హోండా యాక్టివా ఈ స్కూటర్ లో స్వాపబుల్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ హెండ్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్ల విషయంలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. దీనిలో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీలను ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జింగ్ తో సుమారు 102 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. స్టాండర్డ్, స్పోర్ట్స్, ఎకానమీ అనే మూడు రకాల రైడింగ్ మోడ్ లతో వచ్చింది.

హోండా క్యూసీ1 స్కూటర్ లో 1.5 కిలోవాట్ అవర్ ఫిక్స్ డ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. సింగిల్ చార్జితో సుమారు 80 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. ఐదు అంగుళాల ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంటల్ ప్యానెల్, యూఎస్బీ టైప్ సి పోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు స్కూటర్లకు ఫీచర్ల పరంగా చాలా దగ్గర పోలిక ఉంది. కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలు మినహా ఒకేలా ఉంటాయి. యాక్టివా ఈ మాదిరిగా క్యూసీ1లో ఎల్ఈడీ డీఆర్ఎల్, ర్యాప్ రౌండ్ టైల్ లైట్, కొన్ని క్రోమ్ ఎలిమెంట్లు ఉండవు. అలాగే ముందు భాగంలో ఈ స్కూటర్ కు డిస్క్ బ్రేకులు, క్యూసీ1కు డ్రమ్ బేక్ లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి