Pulsar RS 400: కొత్త ఏడాది పల్సర్ నయా వేరియంట్ రిలీజ్..? టీజర్ అదిరిపోయిందిగా..!
భారతదేశంలో బైక్ ప్రియులకు పల్సర్ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువతతో పాటు మిడిల్ ఏజ్ పర్సన్స్ వరకు పల్సర్ బైక్స్‌ను ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పల్సర్ బైక్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని బజాజ్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు పల్సర్ బైక్స్‌లో నయా వెర్షన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. 2025వ సంవత్సరంలో బజాజ్ పల్సర్ ఆర్ 400 నయా వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బజాజ్ కంపెనీ తన అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాలో ఓ క్రిప్టిక్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్లో ప్లే అవుతున్న సింగిల్ సిలిండర్ ఇంజిన్ శబ్దం తప్ప మరేమీ కనిపించడం లేదు. అయితే ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌గా “శబ్దం సరిపోతుంది. ఇది ఏంటో మీకు ఇప్పటికే తెలుసు అని పేర్కొంది. ఈ టీజర్‌ను కచ్చితంగా బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 400కు కర్టెన్ రైజర్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 400 పూర్తిగా ఫెయిర్డ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త బైక్ ఎలా ఉంటుందో టీజర్లో ఎక్కువగా చూపించనప్పటికీ దాని స్టైలింగ్ పూర్తిగా ఫెయిర్డ్ పల్సర్ ఆర్ఎస్200లో అందుబాటులో ఉన్న అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.
కొత్త పల్సర్ ఆర్ఎస్ 400 373సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ ఆధారిత ఆర్ఎస్ 400 బైక్‌లో 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బైక్ యూనిట్ 39.45 హెచ్‌పీ, 35 ఎన్ఎం గరిష్ట టార్క్ న్ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ విధులు 6 స్పీడ్ మాన్యువల్ ద్వారా పని చేస్తాయి. అలాగే పల్సర్ ఆర్ ఎస్ 400 బైక్ చుట్టూ ఎల్ఈడీ లైటింగ్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బజాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై మీరు ఓ లుక్కేయ్యండి
View this post on Instagram
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి