Wealth Astrology: ఈ ఏడాది చివరికల్లా.. ఆ రాశుల వారి జీతాలు, సంపాదన పెరిగే ఛాన్స్..!
Income and Wealth Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహ సంచారం వల్ల ఈ ఏడాది చివరికల్లా కొన్ని రాశుల వారికి త్వరలో జీతభత్యాలు, వ్యక్తిగత ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ద్వితీయ స్థానం, ద్వితీయాధిపతి ప్రభావంతో ఆర్థిక సమస్యలు తొలగి, పొదుపు, పెట్టుబడులలో వృద్ధి కనిపిస్తుంది. ఆశలు నెరవేరి, ఆర్థిక స్థిరత్వం లభించే శుభ సమయం ఇది.

Income Astrology
జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వితీయ స్థానం, ద్వితీయాధిపతి వ్యక్తిగత ధన సంపాదన గురించి తెలియజేస్తాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే కష్టార్జితం గురించి ఇవి తెలియ జేస్తాయి. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తవుతోందనగా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉందా? వ్యక్తిగత ఆదాయంలో వృద్ధి ఏమన్నా ఉంటుందా? అన్న ప్రశ్నలు కలగడం సహజం. ఆదాయం పెరిగి ఆశయాలు, ఆశలేమన్నా తీరుతాయా, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతానా అన్న ప్రశ్నలు కూడా కలుగుతాయి. గ్రహ సంచారం రీత్యా వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మకర రాశులకు త్వరలో జీతభత్యాలు, సంపాదన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- వృషభం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన బుదుడు నవంబర్ 23 వరకు సప్తమ స్థానంలో సంచారం చేయబోతున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అదనపు రాబడి కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ వ్యయాల విషయంలో ఈ రాశివారు సహజం గానే జాగ్రత్తపరులు కనుక ఆదాయం వృద్ధి చెందడానికి, పొదుపులు, మదుపులు చేయడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కూడా అత్యధికంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ద్వితీయ స్థానాధిపతి అయిన రవి ఈ నెల 16 నుంచి పంచమ స్థానంలో ప్రవేశి స్తున్నందువల్ల డిసెంబర్ 16 లోపు ఈ రాశివారి జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆ నెల రోజుల కాలంలో ఆదాయం క్రమంగా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయానికి కూడా లోటుండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు తప్పకుండా పరిష్కారమవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.
- సింహం: ఈ రాశివారికి ధనాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ నెల 23లోగా వీరి నిజ ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలను మించే అవకాశం ఉంది. అదనపు ఆదాయం పెరగడానికి కూడా బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు కూడా బాగా లాభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమ స్యల నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. ఖర్చులు బాగా తగ్గించుకోగలుగుతారు.
- కన్య: ఈ రాశికి ధనాధిపతి అయిన శుక్రుడు ధన స్థానంలోనే ఈ నెల 26 వరకూ సంచారం చేస్తున్నం దువల్ల ఈ రాశివారికి ఈ నెల తప్పకుండా జీతభత్యాలు పెరుగుతాయి. జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు, పొదుపు కూడా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.
- తుల: ఈ రాశివారికి ధనాధిపతి అయిన కుజుడు మరో నెలన్నర పాటు ధన స్థానంలో సంచారం చేయ బోతున్నందువల్ల ఈ రాశివారి జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం, ముఖ్యమైన అవసరాలు తీరిపోవడం జరుగుతుంది. కుజుడి బలం వల్ల అదనపు ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఆదాయ వృద్దికి సంబంధించి ఏ అవకాశాన్నీ వదిలిపెట్టే అవకాశం ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా కలిసివస్తుంది.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల వీరికి ఈ ఏడాదంతా జీతభత్యాలకు సమస్యేమీ ఉండకపోవచ్చు. అంచనాలకు మించి ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. మరింత ఎక్కువగా జీతభత్యాలు ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుమతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పడుతుంది. షేర్లు కూడా బాగా లాభిస్తాయి.



