- Telugu News Photo Gallery Spiritual photos Financial benefits of Lakshmi Narayana Raja Yoga for people of four zodiac signs
5 సంవత్సరాల తర్వాత అద్భుతం.. వీరి దశ తిరిగినట్లే!
నవంబర్ నెల ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది కానున్నది. ఎందుకంటే, ఈ మాసంలో చాలా యోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన 12 రాశులపై ఈ యోగాల ప్రభావం పడనుంది. ఇప్పటికే గజకేసరి రాజయోగం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో యోగం కూడా ఏర్పడనుంది. దీంతో నాలుగు రాశుల వారి దశ తిరిగినట్లే!
Updated on: Nov 03, 2025 | 10:24 AM

గ్రహాల కలయిక వలన యోగాలు ఏర్పడుతుంటాయి. అయితే శక్తివంతమైన గ్రహాలు బుధుడు, సూర్యగ్రహం రెండు గ్రహాల కలయిక ఈ నవంబర్ నెలలో జరగనుంది.దీని వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడ నుంది. దీంతో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : ఈ రాశి వారికి తొమ్మిదొవ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడ నుంది. దీని వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

తుల రాశి : తుల రాశి వారికి అద్భుతమైన సమయం ఈ నవంబర్ నెల. వీరు ఈ మాసంలో ఏ పని ప్రారంభించినా చాలా త్వరగా పూర్తి అవుతుంది. అంతే కాకుండా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఇంట శుభకార్యాలు జరుపుతారు. ఊహించని విధంగా గడబ్బు చేతికందుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. చాలా ఆనందంగా గడుపుతారు.

మకర రాశి : లక్ష్మీనారాయణ రాజయోగం వలన మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వలన దాని ప్రభావంతో ఈ రాశి వారు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది. కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు చాలా లాభాలు పొందుతారు.

మీన రాశి : మీన రాశి వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఊహించని విధంగా లైఫ్ మారిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.



