Success Horoscope: కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారు జీవితంలో ఓ మెట్టు ఎక్కుతారు..!
గురు, శనులు అనుకూలంగా ఉన్న రాశులవారు ఈ ఏడాది చివరి లోపు అనేక విజయాలను చవిచూస్తారు. వ్యక్తిగత జీవితంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయం సాధిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు, ఆదాయ ప్రయత్నాలు, వివాదాల పరిష్కారాలు కూడా సానుకూలపడతాయి. మరో మూడు నాలుగు నెలల కాలంలో..
గురు, శనులు అనుకూలంగా ఉన్న రాశులవారు ఈ ఏడాది చివరి లోపు అనేక విజయాలను చవిచూస్తారు. వ్యక్తిగత జీవితంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయం సాధిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు, ఆదాయ ప్రయత్నాలు, వివాదాల పరిష్కారాలు కూడా సానుకూలపడతాయి. మరో మూడు నాలుగు నెలల కాలంలో మేషం, కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారు సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారు ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాటపట్టిస్తారు.
- కర్కాటకం: ఈ రాశికి ఉద్యోగంలో ఉన్నత పదవులు అనుభవించడానికి బాగా అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లోకి దిగాలన్న ఉద్యోగుల కల నెరవేరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయ త్నాలు తప్పకుండా నెరవేరుతాయి. విదేశీ సంబంధం లేదా సంపన్న కుటుంబంతో సంబంధం ఖాయమయ్యే సూచనలున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి బాగా అవకాశాలు ఉన్నాయి.
- సింహం: ఈ రాశివారు ఉద్యోగపరంగా, వృత్తి, వ్యాపారాలపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజ యాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో మనసులోని ఆశయాలను నెర వేర్చుకుంటారు. ఉద్యోగంలో అన్ని విధాలుగానూ సహోద్యోగులను మించిపోతారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధిం చిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు వృద్ధి చెందుతాయి.
- కన్య: ఈ రాశివారికి ఈ ఏడాదంతా గురు, శనులు అనుకూలంగా ఉంటున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సునాయాసంగా నెరవేరుతుంది. ఆస్తి సమ స్యలు, కోర్టు కేసులు కొద్ది ప్రయత్నంతో అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంపద బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన విధంగా లబ్ధి పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తాయి.
- ధనుస్సు: ఈ రాశివారు ఏ రంగంలో ఉన్న కొద్ది ప్రయత్నంతో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. సహోద్యోగులతో పోటీపడి ముందుకు దూసుకుపోతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరు తుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందుతాయి. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్కరించుకుని లబ్ధి పొందుతారు. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- మకరం: ఈ రాశికి ఈ ఏడాదంతా గురు, శనులు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సంతృప్తికరంగా సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో వేతనాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి