Astrology: బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారి జీవితాల్లో అనూహ్య శుభ పరిణామాలు..!

ఈ నెల 6వ తేదీ నుంచి సింహ రాశిలో ఏర్పడుతున్న బుధాదిత్య యోగం వల్ల కొన్ని జీవితాలు మారడం జరుగుతుంది. ఊహించని శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఈ నెల 16వ తేదీ వరకూ కొనసాగే ఈ బుధాదిత్య యోగం వల్ల ఆ రాశుల వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు.

Astrology: బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారి జీవితాల్లో అనూహ్య శుభ పరిణామాలు..!
Budhaditya Yoga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 05, 2024 | 5:38 PM

ఈ నెల 6వ తేదీ నుంచి సింహ రాశిలో ఏర్పడుతున్న బుధాదిత్య యోగం వల్ల కొన్ని జీవితాలు మారడం జరుగుతుంది. ఊహించని శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఈ నెల 16వ తేదీ వరకూ కొనసాగే ఈ బుధాదిత్య యోగం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది బాగా అనుకూల సమయం.

  1. మేషం: ఈ రాశివారికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం విశేషం. అనేక అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం, రుణ విముక్తి వంటి విషయాల్లో శుభ వార్తలు వింటారు. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల్ని కలుసు కోవడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల కుటుంబంలో సుఖ సంతో షాలు నెలకొనడం, శుభ కార్యాలు జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. గృహ, వాహన సౌక ర్యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలోనే కాకుండా సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాలు, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు సంక్రమి స్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు ఉంటాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో రవి, బుధులు కలవడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెంది, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఉద్యో గంలో వేతనాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబ సమ స్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మాటకు, చేతకు విలువ బాగా పెరుగుతుంది.
  4. సింహం: ఈ రాశిలో బుధాదిత్య యోగం చోటు చేసుకుంటున్నందువల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణ సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభిస్తుంది.
  5. తుల: ఈ రాశికి లాభస్థానంలో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా లాభం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరు గుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, వేతనాల పెరుగుదల చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించిన లాభాలు కలుగు తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి.
  6. వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం రాజయోగాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం సానుకూల మలుపులు తిరుగు తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బలం పుంజుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.
  7. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్య, దశమాధిపతులైన రవి, బుధులు కలవడం వల్ల విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి సంబంధం విషయంలో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి దక్కే సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

ఆ తల్లి సాహసం ముందు.. తోడేలే తోక ముడిచింది..
ఆ తల్లి సాహసం ముందు.. తోడేలే తోక ముడిచింది..
కోల్‌కతా కేసు నిందితుడు జైల్లో ఎగ్‌ నూడుల్స్‌ కావాలని డిమాండ్
కోల్‌కతా కేసు నిందితుడు జైల్లో ఎగ్‌ నూడుల్స్‌ కావాలని డిమాండ్
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..
వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి.. ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసులు..
30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. సాయం చేయడంలోనూ మెగా ఫ్యామిలీ ముందే..
30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. సాయం చేయడంలోనూ మెగా ఫ్యామిలీ ముందే..
30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??
30 కిలోమీటర్ల వెంటాడి విద్యార్థి కాల్చివేత.. ఏం జరిగిందంటే ??
67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు
67 మంది ప్రాణాలు కాపాడారు.. కానీ తమ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు
రూ.100 కోట్ల దిశగా 'సరిపోదా శనివారం'
రూ.100 కోట్ల దిశగా 'సరిపోదా శనివారం'
దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని
దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని
'రివెంజ్ సేవింగ్స్' చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి
'రివెంజ్ సేవింగ్స్' చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి
AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది: శ్రీధర్ బాబు
AI సిటీ నూతన ఆవిష్కరణలకు పుట్టినిల్లు అవుతుంది: శ్రీధర్ బాబు