Job Astrology: స్వస్థానంలో వక్రించిన శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి సరికొత్త ఉద్యోగ యోగం పక్కా..!

Lord Shani Dev: ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు స్వస్థానమైన కుంభ రాశిలో ఉండడం, పైగా వక్రించి ఉండడం వల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగం మారడానికి, కెరీర్ మార్చుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. స్వస్థానంలో శని వక్రించడం వల్ల సాధారణంగా ఉద్యోగంలో తప్పకుండా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.

Job Astrology: స్వస్థానంలో వక్రించిన శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి సరికొత్త ఉద్యోగ యోగం పక్కా..!
Job Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 05, 2024 | 6:10 PM

ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు స్వస్థానమైన కుంభ రాశిలో ఉండడం, పైగా వక్రించి ఉండడం వల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగం మారడానికి, కెరీర్ మార్చుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. స్వస్థానంలో శని వక్రించడం వల్ల సాధారణంగా ఉద్యోగంలో తప్పకుండా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి నవంబర్ 15 లోగా సరికొత్త ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాలవారు సొంత ప్రాంతానికి రావడానికి, స్వస్థలాల్లో ఉన్నవారు దూర ప్రాంతాలకు వెళ్లడానికి కూడా అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి దశమాధిపతి, ఉద్యోగ కారకుడు అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. పదోన్నతికి కోసం, భారీ వేతనం కోసం ఈ రాశివారు ఉద్యోగం మారడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాలు లేదా దూర ప్రాంతం నుంచి మెరుగైన ఆఫర్ అందే సూచనలున్నాయి. చాలా కాలంగా ఒకే ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నవారికి తప్పకుండా స్థాన చలనం ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశివారికి దశమాధిపతి అయిన శని దశమ స్థానంలోనే వక్రించి ఉన్నందువల్ల తప్పకుండా ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. ఇతర సంస్థల నుంచి అధిక సంఖ్యలో ఆఫర్లు అందే అవ కాశం ఉంటుంది. దూర ప్రాంత సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు స్వస్థలాలకు లేదా దగ్గర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా మారే సూచనలున్నాయి. ఉద్యోగంలో మరింత సుస్థిరత, భద్రత కోసం ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
  3. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో వక్రించిన సప్తమాధిపతి శని కారణంగా తప్పకుండా ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. సాధారణంగా దూర ప్రాంతానికి పదోన్నతి మీద బదిలీ కావడం జరుగుతుంది. వ్యాపార విస్తరణ లేదా కొత్త బ్రాంచీల ఏర్పాటు వంటి కారణంగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు రావడం కూడా జరుగు తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి లేదా అనువైన ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలున్నాయి.
  4. వృశ్చికం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో వక్రంగా సంచారం చేస్తున్న శని వల్ల స్థాన చలనం తప్పకపో వచ్చు. దగ్గర ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు దూర ప్రాంతానికి వెళ్లవలసి రావచ్చు. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఎక్కడ ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ప్రతిభాపాటవాలకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే హోదాలు లేదా బాధ్యతలు మారడం జరగవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు ఈ రాశికి ధన స్థానంలో వక్రించి ఉన్నందువల్ల ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. మరింత మంచి ప్యాకేజీ కోసం ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. పనిచేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగదలచుకున్న పక్షంలో తరచూ హోదాలు మారడం, బాధ్యతలు మారడం వంటివి జరిగే అవకాశం ఉంది. సాధారణంగా దూర ప్రాంతం నుంచి దగ్గర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
  7. కుంభం: ఈ రాశిలో వక్రించిన రాశినాథుడు శని దశమ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణంగా దూర ప్రాంతానికి లేదా విదేశాలకు వెళ్లడం జరు గుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశాలున్నాయి. హోదా, బాధ్య తలు, భారీ వేతనాలకు అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యోగు లకు మంచి గుర్తింపు ఏర్పడి అనేక ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!
కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!
అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!
అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!
రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!
రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!
గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్
గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్
ఎన్టీఆర్ వీక్‌నెస్‌ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..
ఎన్టీఆర్ వీక్‌నెస్‌ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..
ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.! నిజమేనా.?
ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.! నిజమేనా.?
పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.
పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.
6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు?|జానీని పట్టించింది భార్యే
6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు?|జానీని పట్టించింది భార్యే
తిరుమల లడ్డూ కాంట్రవర్సీ.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం
తిరుమల లడ్డూ కాంట్రవర్సీ.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం
జానీ మాస్టర్ లైఫ్ లో వంకర స్టెప్పులు.. ఇంతకీ ఏమిటి అసలు కహానీ
జానీ మాస్టర్ లైఫ్ లో వంకర స్టెప్పులు.. ఇంతకీ ఏమిటి అసలు కహానీ