Horoscope Today: ఆ రాశికి చెందిన ఉద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మిథున రాశి వారికి బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఎక్కువవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశికి చెందిన ఉద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 06th September 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 06, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మిథున రాశి వారికి బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఎక్కువవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. చేపట్టిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో కొన్ని చిక్కులు తొలగిపోతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఆశించిన గుర్తింపుతో పాటు ఆదరణ లభిస్తుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయ కంగా సాగిపోతాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ సంబంధ మైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగాలు నిదానంగా, సానుకూలంగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల మీద బాగా శ్రద్ధ పెంచుతారు. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ సవ్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, వేతన పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డదు,

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుటుంబంతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో కొనసాగుతాయి. ఉద్యో గాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెళ్లి విషయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ వార్త అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితంలో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. చేపట్టిన పనులు నిదా నంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొందరు ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు ఇష్టమైన బంధుమిత్రుల నుంచి విలువైన వస్తువులు కానుకలుగా పొందుతారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తిపాస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఆద రణ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఢోకాఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యక్తిగతంగా చిన్నపాటి సమస్యలు, చికా కులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా ఉత్సాహం కలిగిస్తాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపార వ్యవహారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. మిత్రులతో సరదాగా గడుపుతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవ కాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్లు, తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని సంతృప్తికరంగా చక్కబెడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడ తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. బంధువుల నుంచి ఊహించని శుభ వార్తలు అందుకుంటారు. అనుకున్న పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొన సాగుతుంది. స్నేహితుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. కొందరు మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. తోబుట్టువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది. ధనాదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఇతరులతో తొందరపాటుతో వ్యవహరించకపోవడం మంచిది. కొందరు బంధు మిత్రుల వల్ల చికాకులుంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయటా కొన్ని అనుకూలతలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. చేపట్టిన పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆదాయ సమస్యలు ఉండకపోవచ్చు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొందరు బంధుమిత్రుల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు. ఇల్లు కొనే ఆలోచనలకు ఊతం లభిస్తుంది. ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు కలుగుతాయి. అనుకో కుండా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం కనిపి స్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి