Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 7, 2024): మేష రాశి వారు ఈ రోజు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 07th September 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 07, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 7, 2024): మేష రాశి వారు ఈ రోజు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబంలో కొన్ని కీలకమైన చిక్కులు తొలగిపో తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఇంటా బయటా మాట చెల్లుబాటు అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా బాధ్యతలు, పని భారం బాగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

మిథునం (మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ప్రతిభకు తగ్గ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరి ష్కారం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆలయ సేవల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. పెద్దల సహా యంతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. కొందరు బంధు మిత్రు లకు సహాయం చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణ యాలు తీసుకోవడం మంచిది. ఇల్లు కొనుగోలు కార్యక్రమం వాయిదా పడుతుంది. వృత్తి, వ్యాపా రాలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగిపోతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉండకపోవచ్చు. ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆస్తి పాస్తుల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యో గాల్లో మీ సమర్థత మరింతగా రాణిస్తుంది. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ బాగా పెరుగుతుంది. తొందరపడి మాట్లాడడం వల్ల, ఊహించని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

దూరపు బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందు తుంది. అనుకున్న పనులన్నిటినీ సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా దూసుకుపోతాయి. ఉద్యోగంలో అధి కా రులు అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ప్రయాణాలు అనుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. బంధువులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. చేతిలో అవసరానికి సరిపడ డబ్బుంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని భారం ఉన్న ప్పటికీ సమర్థతను నిరూపించుకుంటారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవు తుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

చేపట్టిన ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత, వ్యయప్రయాసలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. మిత్రుల వల్ల చిక్కు పరిస్థితులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభాలపరంగా నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహాన్ని, ప్రోత్సా హకాలను అందుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ధనపరమైన ఇబ్బందులు, ఒత్తిళ్లన్నీ తొలగిబఝ పోతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇల్లు కొనాలనే ఆలోచన కార్య రూపం దాలుస్తుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో రాబడి వృద్ధి చెందుతుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త..
అంచనాలు పెంచేస్తున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌.! ఇక్కడ నిలిచేది ఎవరు?
అంచనాలు పెంచేస్తున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌.! ఇక్కడ నిలిచేది ఎవరు?
ఈ రెండుజెళ్ళ అమాయకపు నవ్వుల చిన్నారి ఎవరో తెలుసా.?
ఈ రెండుజెళ్ళ అమాయకపు నవ్వుల చిన్నారి ఎవరో తెలుసా.?
ప్రభాస్ ఫ్యాన్స్‌ను తమిళ హీరో విజయ్ టార్గెట్ చేసారా.? క్లారిటీ..
ప్రభాస్ ఫ్యాన్స్‌ను తమిళ హీరో విజయ్ టార్గెట్ చేసారా.? క్లారిటీ..
వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్స్‌
వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్స్‌
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
గండ్లు పూడ్చివేతకు రంగంలోకి దిగిన ఆర్మీ
గండ్లు పూడ్చివేతకు రంగంలోకి దిగిన ఆర్మీ
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగితే ఊహించ లేనన్ని లాభాలు..
ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగితే ఊహించ లేనన్ని లాభాలు..
యోగాసనాలు వేసే ముందు ఈ నియమాలు యాదిలో పెట్టుకోవాలి
యోగాసనాలు వేసే ముందు ఈ నియమాలు యాదిలో పెట్టుకోవాలి
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
విజయవాడ వరదల నష్టమెంతో తెలుసా.? 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధం
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
నా డెబిట్‌ కార్డు వాడండి.. నచ్చింది కొనుక్కోండి.! బోల్డ్‌కేర్‌..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చిక..
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.మరో అంతరిక్ష నౌకలో సునీతా, బుచ్
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసి
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
పారిపోదామనుకొని ప్రాణాలు కోల్పోయిన 129 మంది ఖైదీలు.!
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్‌.
కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..
కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! జిల్లాలకు ఎల్లో అలర్ట్‌