మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్న నాటి మిత్రులు, పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు తప్పకుండా నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొన్ని వ్యక్తిగత వివాదాలు, సమస్యలను ఓపికగా పరిష్కరిం చుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురో గతి చెందుతాయి. ఏలిన్నాటి శని వల్ల మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలు, శ్రమ, తిప్పట వంటివి ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.