Money Astrology: చంద్రుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభానికి ఛాన్స్..!
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు తుల, వృశ్చికం, ధనూ రాశుల్లో సంచారం చేయబోతున్న చంద్రుడి వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. చంద్రుడు మనఃకారకుడైనందువల్ల సాధారణంగా మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశం ఉంటుంది. చంద్రుడు సంపదకు కూడా కారకుడైనందువల్ల ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం, ఆకస్మిక ధన లాభం కలగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది.
Moon Gochar Impact: ఈ నెల 7వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు తుల, వృశ్చికం, ధనూ రాశుల్లో సంచారం చేయబోతున్న చంద్రుడి వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. చంద్రుడు మనఃకారకుడైనందువల్ల సాధారణంగా మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశం ఉంటుంది. చంద్రుడు సంపదకు కూడా కారకుడైనందువల్ల ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం, ఆకస్మిక ధన లాభం కలగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకరం, మీన రాశులు ఈ చంద్ర సంచారం వల్ల బాగా లాభపడడం జరుగుతుంది. చంద్రుడి వల్ల ఈ ఆరు రోజుల్లో గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం ఏర్పడడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి చంద్ర సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ధన సంబంధ మైన ఏ వ్యవహారమైనా సత్ఫలితాలిస్తుంది. నిర్ణయాలు, ఆలోచనలు, కార్యక్రమాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి ఖాయ మవుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా లాభసాటి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడితో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు పడుతున్నందువల్ల అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు సంబంధించిన శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభాలకు బాగా అవ కాశం ఉంది. రావాల్సిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. అదనపు ఆదాయానికి అనేక అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో లాభసాటి పరిచయాలు, ఒప్పందాలు చోటు చేసుకుంటాయి.
- సింహం: ఈ రాశికి చంద్ర సంచారం వల్ల రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. మనసులోని కోరికలు నెర వేరుతాయి. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
- తుల: ఈ రాశివారికి గజకేసరి, చంద్ర మంగళ యోగాల వల్ల తప్పకుండా బ్యాంక్ నిల్వలు వృద్ధి చెందు తాయి. ఆస్తిపాస్తుల మీదా, షేర్ల మీదా అత్యధికంగా మదుపు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఉద్యోగంలో వేతనాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుం బంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. సొంత ఇంటి కల నెరవేరడం కూడా జరుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి మనసులోని కోరికలు ఒకటి రెండు తప్పకుండా నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. రావలసిన సొమ్ముతో పాటు, బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లల వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
- మీనం: ఈ రాశికి చంద్ర సంచారం బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యం సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభాపాటవాలు, సమర్థతను నిరూపించుకుని లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నష్టాలు, సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి బాటపడతాయి. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది.