Lucky Horoscope: భాగ్యాధిపతి అనుకూలత.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం పట్టే ఛాన్స్..!
సాధారణంగా భాగ్యాధిపతిని బట్టి కార్యసిద్ధి, వ్యవహార జయం, ఆకస్మిక ధన లాభం, జీవితంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు వంటి అంశాలు నిర్ణయం అవుతాయి. జాతక చక్రంలో భాగ్యాధిపతి సరైన స్థానంలో ఉండే పక్షంలో అటువంటి వారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కొద్ది శ్రమతో అత్యధికంగా లాభాలు పొందడం జరుగుతుంది.
సాధారణంగా భాగ్యాధిపతిని బట్టి కార్యసిద్ధి, వ్యవహార జయం, ఆకస్మిక ధన లాభం, జీవితంలో సానుకూల మార్పులు, శుభ పరిణామాలు వంటి అంశాలు నిర్ణయం అవుతాయి. జాతక చక్రంలో భాగ్యాధిపతి సరైన స్థానంలో ఉండే పక్షంలో అటువంటి వారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. కొద్ది శ్రమతో అత్యధికంగా లాభాలు పొందడం జరుగుతుంది. ఈ నెల గ్రహ సంచారం ప్రకారం ఏయే రాశుల వారికి భాగ్యాధిపతి (నవమ స్థానాధిపతి) అనుకూలంగా ఉన్నదీ, ఏ రాశుల వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతున్నదీ ఇక్కడ పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన గురువు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. పితృమూలక ఆస్తి లేదా సంపద లాభం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచన లున్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు పదవ స్థానంలో, అందులోనూ స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కెరీర్ పరంగా అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కోరుకున్న విధంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక అవకాశాలు అందడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభదాయకంగా సాగిపోతాయి. తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.
- మిథునం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు భాగ్య స్థానంలోనే ఉన్నందువల్ల ఉద్యోగులకు అనేక విధాలుగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. కుటుంబసమేతంగా తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- సింహం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆక స్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ పని, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయ త్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు, ఒప్పందాలు ఏర్పడతాయి. ఆస్తి కలిసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడి, అభివృద్ధి బాటపట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. రెండు మూడు పర్యా యాలు ధన యోగం పట్టే సూచనలున్నాయి. ఉద్యోగ జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. తప్ప కుండా ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. అనారోగ్యానికి సరైన పరిష్కారం లభిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి ఈ నెలంతా భాగ్య, దశమ స్థానాల్లో ఉండబోతున్నందువల్ల ప్రభుత్వం నుంచి ఆశించిన ధన లాభాలు కలగడంతో పాటు, గుర్తింపు, గౌరవ మర్యాదలు కూడా లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందే సూచనలు న్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు ఘన విజయం సాధించడం జరుగు తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి