Lucky Zodiac Signs: మూడు గ్రహాలకు బలం…ఆరు రాశులకు అదృష్టమే అదృష్టం!
Telugu Astrology: శని, రాహువు, గురువులు తమ సొంత నక్షత్రాలలో సంచారం వల్ల మూడు నెలల పాటు ఉచ్ఛ బలం పొందారు. దీనివల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులకు అనూహ్య శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశుల వారికి ఆర్థిక వృద్ధి, ఉద్యోగ పురోగతి, ఆస్తి లాభం, కోరికల నెరవేర్పు వంటివి "పట్టిందల్లా బంగారం" చేసే స్థాయిలో ఉంటాయి.

Lucky Zodiac Signs
జ్యోతిషశాస్త్రంలో శని, రాహువు, గురువులు అత్యంత ప్రధానమైన గ్రహాలు. ఇవి ఏ రాశిలోనైనా ఎక్కువ కాలం సంచారం చేస్తాయి. వివిధ రాశుల మీద వీటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గ్రహ సంచారంలో ఈ మూడు గ్రహాలకు బలం పెరిగింది. శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలోనూ, రాహువు తన సొంత నక్షత్రమైన శతభిషంలోనూ, గురువు తన సొంత నక్షత్ర మైన పునర్వసులోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ గ్రహాలకు మూడు నెలల పాటు ఉచ్ఛ బలం కలిగింది. ఫలితంగా ఈ గ్రహాలు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులను అన్ని విధాలా అందలాలు ఎక్కించబోతున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.
- వృషభం: ఈ రాశివారికి ఆదాయం బాగా పెరగడానికి, అధికార యోగం పట్టడానికి, మనసులోని ముఖ్య మైన కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరడానికి శని, రాహు, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. వీరు కొత్త లక్ష్యాలు, ఆశయాలతో ముందుకు వెళ్లడం మంచిది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం ఉత్తమం. ఆస్తి వివాదాలు, సమస్యలకు ఏదో విధంగా స్వస్తి చెప్పడం మంచిది. వ్యక్తిగత పురోగతికి బాగా అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశిలో గురువు, భాగ్య స్థానంలో రాహువు, దశమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో శీఘ్రపురోగతికి బాగా అవకాశం ఉంది. నైపుణ్యాలను, సమర్థతను ఎంత మెరుగుపరచుకుంటే అంత మంచిది. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో వృత్తి, వ్యాపా రాలు ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం మంచిది.
- కన్య: ఈ రాశికి దశమంలో ఉన్న గురువుకు, ఆరవ స్థానంలో ఉన్న రాహువుకు, ఏడవ స్థానంలో ఉన్న శనికి బలం పెరగడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలించి దూరప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నం ఫలించి సంపన్న కుటుంబంతో సంబంధం కుదురుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం కావడం వల్ల సంపన్నుల స్థాయి కలుగుతుంది. ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుని పదోన్నతి పొందుతారు.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువుకు, షష్ట స్థానంలో ఉన్న శనికి, పంచమంలో ఉన్న రాహువుకు బలం పెరగడం వల్ల వ్యక్తిగత, కుటుంబ జీవితంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు రాజీమార్గంలో పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి.
- మకరం: ఈ రాశికి గురు, శని, రాహువుల బలం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా రాణించి అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది.
- కుంభం: ఈ రాశిలోని రాహువుకు, ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి శనికి, పంచమ స్థానంలో ఉన్న గురువుకు బలం పెరగడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలిగే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక దన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ది చెందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.


