Hyderabad: స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం..!
హైదరాబాద్ శివారు శంకర్‌పల్లి దగ్గర ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి బెళగావి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ వెనుక బోగిలో మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన స్టేషన్ మాస్టర్ లోకో ఫైలట్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే ఫైర్ సిలిండర్‌తో మంటలు ఆర్పిన లోకో ఫైలట్, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ నుంచి బెళగావి వెళుతున్న స్పెషల్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో రైల్వే సిబ్బంది తోపాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రేక్ జామ అవడంతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. భోగి వెనక ఉన్న మొదటి ప్యాసింజర్ కంపార్టుమెంటులో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన అనంతరం నిపుణుల సూచనల మేరకు రైలు తిరిగి బయలుదేరింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..