Rashi Phalalu: వారికి ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటుంది..12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today (October 26, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆలయాల సందర్శన ఉంటుంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి వృద్ధి ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (అక్టోబర్ 26, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో అధికారుల కారణంగా బాధ్యతల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆలయాల సందర్శన ఉంటుంది. ఆర్థిక విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి వృద్ధి ప్రయత్నాలు సజావుగా సాగిపోతాయి. బంధువుల జోక్యంతో ఒక ముఖ్య మైన ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో కుటుంబంలో ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగం మారేందుకు అవ కాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల తీరు ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా నిదానంగా సాగుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సహచరులకు బాధ్యతల నిర్వహణలో సహాయ పడతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభ కార్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్య మైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపి స్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు మిత్రు లతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటికి బంధువులు వచ్చే సూచనలున్నాయి. కుటుం బంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగులు, నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల వారికి కలిసి వస్తుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. రాజకీయాలు, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ వంటి రంగాల వారు ముందుకు దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఉన్నవారు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. రావలసిన సొమ్మును వసూలు చేసుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వాయిదా వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. గృహ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): వృత్తి, ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్నిసకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలుంటాయి. బంధుమిత్రుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో ఎవరి మీదా ఆధారపడకపోవడం మంచిది. సహచరులతో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో సంతృప్తి చెందాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంది.



