- Telugu News Photo Gallery Spiritual photos Do you know how many days after a person dies they will be reborn?
మరణించిన వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత మళ్లీ పుడతారో తెలుసా?
జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అనే నానుడి అందికీ తెలిసిందే. భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మరణిస్తూనే ఉంటారు. అయితే మరణించిన వారు మళ్లీ పుడతారు, కానీ వారు ఎక్కడ ఏ రూపంలో పుడతారో ఎవ్వరికీ తెలియదు అంటారు. కాగా, ఇప్పుడు మనం మరణించిన వారు మళ్లీ ఎన్ని రోజులకు పుడతారో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 25, 2025 | 8:13 PM

జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అనే నానుడి అందికీ తెలిసిందే. భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మరణిస్తూనే ఉంటారు. అయితే మరణించిన వారు మళ్లీ పుడతారు, కానీ వారు ఎక్కడ ఏ రూపంలో పుడతారో ఎవ్వరికీ తెలియదు అంటారు. కాగా, ఇప్పుడు మనం మరణించిన వారు మళ్లీ ఎన్ని రోజులకు పుడతారో ఇప్పుడు చూద్దాం.

మరణం అనేది తప్పనిసరి. కానీ ఎవ్వరు ఎప్పుడు చనిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఇక పుట్టుక, చావుల గురించి గరుడ పురాణంలో చాలా విషయాలు తెలిజేయడం జరిగింది. కాగా, ఇప్పుడు మనం మరణించిన వారు మళ్లీ ఎన్ని రోజులకు జన్మిస్తారు. దీని గురించి గరుడ పురాణంలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం భూమిపై ఉన్న ఏ జీవి అయినా సరే మరణిస్తుంది. మళ్లీ పుడుతుందంట. చనిపోయిన మూడో రోజు నుంచి 40 రోజులలోపు ఆత్మ మరొక శరీరం ధరిస్తుందంట. ఒక శరీరం వదిలిన తర్వాత ఆత్మ యమలోకానికి వెళ్లి, అక్కడ తన పాప పుణ్యాలను లెక్కించుకొని, తగిన శిక్షలు అనుభవిస్తుంది.

తర్వాత ఆత్మ చేసిన కర్మల ఫలితం ఆధారంగా, తనకు మరు జన్మ అనేది లభిస్తుందంట. మంచి పనులు చేసిన వారు చాలా త్వరగా మోక్షం పొంది, మరో జన్మను పొందితే, చెడు పనులు చేసిన వారు మాత్రం నరక బాధలు అనుభవించిన తర్వాత పునర్జన్మను పొందుతారంట.

అలాగే పురాణాల ప్రకారం ఆత్మ అనేది 4 లక్షల సార్లు మానవ రూపంలో పుడుతుందంట. అలా జరిగిన తర్వాతే పితృ లేదా దేవ యోని లభిస్తుందంట. పురాణాల ప్రకారం ఆత్మ వస్త్రాల లాగా , శరీరాన్ని మారుస్తుందని చెబతున్నారు నిపుణులు.