AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారు శుభవార్తలు వింటారు.. దీపావళి నాడు 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం రాశి వారి వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఊపందుకుంటాయి. వృషభం వారి వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. మిథునం రాశి వారి ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం దీపావళి పండుగ నాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: వారు శుభవార్తలు వింటారు.. దీపావళి నాడు 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 20, 2025 | 6:43 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల తీరుతెన్నులు బాగా మారిపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి. లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. భారీ లక్ష్యాలను పూర్తి చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసు కోగలుగుతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరు గుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో కొన్ని భారీ లక్ష్యాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కొందరు సన్నిహత మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభావం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి రాబడితో పురోగమిస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఆశించిన లాభాలనిస్తాయి. బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవు తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. అదనపు ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. పలుకుబడి, గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండ వద్దు.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?