ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవులో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓడల రేవులో సముద్రం వెనక్కి వెళ్లింది. తీరం నుంచి సముద్రం నీరు సుమారు 30 మీటర్లు వెనక్కి వెళ్లింది. ఇప్పుడీ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సముద్రం నీరు ముందుకు రాగా, ఇప్పుడు వెనక్కి వెళ్లడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో సముద్రం ముందుకు వచ్చి ongc ప్రహరి గోడలను తాకింది. దీనివల్ల రోడ్డు కోతకు గురైంది.
కానీ ఆదివారం నుంచి సముద్రం వెనక్కు వెళ్ళింది. ఈ ప్రాంతంలో సముద్రం వెనక్కి వెళ్లడం ఇదే తొలిసారి అంటున్నారు స్థానికులు. సముద్రం నీరు ఇలా వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణం ప్రభావంతో ఇలా సముద్రం ముందుకు వెనక్కు వెళ్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..