AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: ఆ సమస్యకు ఎట్టకేలకు చెక్‌ పెడుతోన్న వాట్సాప్‌.. ఫొటోలు సెండ్ చేసే విషయంలో..

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో, యూజర్లను సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే ఉంది. ఇటీవలి కాలంలో వాట్సాప్‌ వరసపెట్టి ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది...

Whatsapp: ఆ సమస్యకు ఎట్టకేలకు చెక్‌ పెడుతోన్న వాట్సాప్‌.. ఫొటోలు సెండ్ చేసే విషయంలో..
Whatsapp
Narender Vaitla
|

Updated on: Jan 23, 2023 | 2:44 PM

Share

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో, యూజర్లను సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే ఉంది. ఇటీవలి కాలంలో వాట్సాప్‌ వరసపెట్టి ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేసేందుకు వాట్సాప్‌ సిద్ధమైంది. సాధారణంగా వాట్సాప్‌ విషయంలో యూజర్లకు ఉండే ఫిర్యాదుల్లో ఫొటో క్వాలిటీ ఒకటి. గ్యాలరీలో ఎంతో క్వాలిటీతో కనిపించే ఫొటోను ఇతరులకు పంపించగానే క్లారిటీ తగ్గుతుంది.

మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. తాజాగా ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఒరిజినల్‌ క్వాలిటీతో ఫొటోలను పంపించేందుకు వీలుగా ఫొటో క్వాలిటీ అనే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఇతరులకు షేర్‌ చేసే ఫొటోలు అవతలి వారికి కంప్రెస్డ్, గ్రైనీగా సెండ్‌ అవుతున్నాయి. ఎంత క్వాలిటీ ఉన్నా ఈమేజ్‌లు అయినా క్లారిటీ తగ్గి సెండ్ అవుతాయి.

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తాము పంపుతున్న ఫొటోల క్వాలిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2.23.2.11 వాట్సాప్ బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకున్నారు. వాట్సాప్‌ ఈ ఫీచర్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. ఈ ఫీచర్‌ కనుగ అందుబాటులోకి వస్తే ఇకపై యూజర్లు ఫొటోలను హెడ్‌డీ క్లారిటీలో పంపుకోవచ్చన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
AI నాశనం చేస్తుంది.. పదేళ్ల తర్వాత మనం ఉండమా?
AI నాశనం చేస్తుంది.. పదేళ్ల తర్వాత మనం ఉండమా?
ఆరుగాలం కష్టపడ్డారు.. పంటలను పశువులకు వదిలేశారు..
ఆరుగాలం కష్టపడ్డారు.. పంటలను పశువులకు వదిలేశారు..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్.. మిస్ అవ్వొద్దు
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన బాక్సాఫీస్ సెన్సేషన్.. మిస్ అవ్వొద్దు
షుగర్, బరువు తగ్గడానికి దివ్యౌషధం ఈ మసాలా కిచిడీ.. 
షుగర్, బరువు తగ్గడానికి దివ్యౌషధం ఈ మసాలా కిచిడీ.. 
ఖరీదైన హ్యాండ్ క్రీములు వద్దు.. నీలి పూలతో ఇంట్లోనే బామ్ తయారీ!
ఖరీదైన హ్యాండ్ క్రీములు వద్దు.. నీలి పూలతో ఇంట్లోనే బామ్ తయారీ!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రైల్వే లైన్
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రైల్వే లైన్
సమోసా, మోమోస్ చట్నీ ఇకపై ఎర్రగా కనిపంచదు ఎందుకో తెలుసా
సమోసా, మోమోస్ చట్నీ ఇకపై ఎర్రగా కనిపంచదు ఎందుకో తెలుసా
జనవరి తర్వాత దాహం దాహం.. జలమండలి దగ్గర ఉందా పరిష్కారం..?
జనవరి తర్వాత దాహం దాహం.. జలమండలి దగ్గర ఉందా పరిష్కారం..?
నల్లగా, కొమ్ముల్లా కనిపించే ఈ కాయల పేరేంటి? అసలెక్కడ పండిస్తారు..
నల్లగా, కొమ్ముల్లా కనిపించే ఈ కాయల పేరేంటి? అసలెక్కడ పండిస్తారు..
కత్తెర మొద్దుబారిపోయిందా? కొత్తది కొనకుండా ఇంట్లోనే ఇలా సరిచేయండి
కత్తెర మొద్దుబారిపోయిందా? కొత్తది కొనకుండా ఇంట్లోనే ఇలా సరిచేయండి