AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: ఇంట్లో తాబేలు ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు

వాస్తు శాస్త్రంలో తాబేలు (కూర్మం)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో తాబేలు లేదా తాబేలు బొమ్మ ఉంచితే అనేక లాభాలు సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘాయుష్షు, స్థిరత్వం, సంపదకు ప్రతీకగా భావించే తాబేలు విగ్రహాన్ని సరైన స్థలంలో ఉంచినప్పుడు, ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతూ కుటుంబ శాంతి, ఆర్థిక సమృద్ధి పెరుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Vastu tips: ఇంట్లో తాబేలు ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Tortoise
Rajashekher G
|

Updated on: Jan 07, 2026 | 11:11 AM

Share

వాస్తు శాస్త్రంలో తాబేలు (కూర్మం)కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇంట్లో తాబేలు లేదా తాబేలు బొమ్మ ఉంచితే అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. దీర్ఘాయుష్షు, స్థిరత్వం, సంపదకు ప్రతీకగా భావించే తాబేలు విగ్రహాన్ని ఇంట్లో సరైన స్థలంలో ఉంచితే సానుకూల శక్తులు పెరిగి, కుటుంబంలో శాంతి, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం కూడా తాబేలు సహనం, బలానికి సూచికగా పేర్కొనబడింది. అందుకే ప్రాచీన కాలం నుంచి అనేక మంది ఇళ్లలో తాబేలు విగ్రహాన్ని చూడవచ్చు.

తాబేలు ఇంట్లో ఉంటే వచ్చే లాభాలు

ఆర్థిక అభివృద్ధి: వాస్తు నియమాల ప్రకారం తాబేలు విగ్రహాన్ని సరైన దిశలో ఉంచితే ధనలాభం పెరిగి, ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయని నమ్మతారు.

ఆరోగ్యం, దీర్ఘాయుష్షు: తాబేలు దీర్ఘాయుష్షుకు ప్రతీక. ఇంట్లో దీని ప్రతిమ ఉండటం వల్ల ధన లాభం పెరగడంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు.

పాజిటివ్ ఎనర్జీ: తాబేలు ప్రశాంతతకు సంకేతం. దీని ఉనికి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తగ్గించి, శాంతియుత వాతావరణాన్ని కలిగిస్తుంది. దీంతో ఇంట్లో పాజిటివ్ వాతావరణం పెరిగి కుటుంబసభ్యుల మధ్య మంచి సంబంధాలు బలపడతాయి.

తాబేలు విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి?

ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం అత్యంత శుభకరమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా పూజ గదిలో ఒక చిన్న పాత్రలో నీటితో పాటు తాబేలు విగ్రహాన్ని ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయని విశ్వాసం.

పిల్లల చదువుల్లో ఏకాగ్రత పెరగాలంటే లోహంతో చేసిన తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో తాబేలు విగ్రహాన్ని లోపలికి చూసేలా ఉంచితే వ్యాపారాభివృద్ధి కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో తాబేలు.. ఈ తప్పులు చేయొద్దు

జీవ తాబేలు కన్నా చెక్కతో చేసిన లేదా లోహాలతో చేసిన తాబేలు విగ్రహాలను ఉంచడమే వాస్తు పరంగా శ్రేయస్కరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాబేలు విగ్రహాన్ని నేలపై నేరుగా ఉంచకుండా శుభ్రమైన, ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. బెడ్‌రూమ్, బాత్రూమ్ లేదా అపవిత్ర ప్రాంతాల్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం మంచిది కాదని సూచిస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని సరైన విధంగా, సరైన దిశలో ఉంచితే ఇంట్లో సంపద, శాంతి, ఆరోగ్యం పెరుగుతాయని నమ్మకం. అయితే వాస్తు నియమాలు పాటించకపోతే మాత్రం ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Note: ఈ వార్తలోని సమాచారం వాస్తుశాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.