IND vs NZ 1st ODI: కివీస్‌తో తొలి వన్డే.. 4నెలల తర్వాత మిడిలార్డర్ మొనగాడు రీఎంట్రీ.. కివీస్‌కు ఇచ్చిపడేసుడే ఇక
India vs New Zealand Probable Playing XI: న్యూజిలాండ్ జట్టుతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 11న తొలి వన్డే జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ స్పెషలిస్ట్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Shreyas Iyer comeback: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. వడోదర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత స్వదేశంలో కివీస్‌తో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, తుది జట్టు (Team India Playing XI) అంచనాలను ఇప్పుడు చూద్దాం..
శ్రేయస్ అయ్యర్ పునరాగమనం, పటిష్టంగా భారత్..
టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాడు, నాలుగో స్థానంలో నమ్మదగ్గ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చాడు. ఈ సిరీస్‌లో అతను వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా, శుభ్‌మన్ గిల్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రాకతో భారత బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది.
భారత పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు (రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్) తో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ప్రధాన అస్త్రాలుగా ఉండనున్నారు.
బ్రేస్‌వెల్ సారథ్యంలో కివీస్ సేన..
న్యూజిలాండ్ జట్టు మైఖేల్ బ్రేస్‌వెల్ నాయకత్వంలో భారత్‌లో పర్యటిస్తోంది. వారి 15 మంది సభ్యుల జట్టులో ఐదుగురు బ్యాటర్లు, ఐదుగురు ఆల్ రౌండర్లు, ఐదుగురు బౌలర్లను సమతూకంగా ఎంపిక చేశారు. భారత మూలాలున్న యువ స్పిన్నర్ ఆదిత్య అశోక్ ఈ సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు వెన్నుముకగా ఉన్నారు.
ఇరు జట్ల అంచనా తుది జట్టు (Probable Playing XI):
భారత తుది జట్టు (India Probable XI):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
శ్రేయస్ అయ్యర్
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్)
రవీంద్ర జడేజా
వాషింగ్టన్ సుందర్
కుల్దీప్ యాదవ్
మహమ్మద్ సిరాజ్
హర్షిత్ రాణా
అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ తుది జట్టు (New Zealand Probable XI):
డెవాన్ కాన్వే
నిక్ కెల్లీ
హెన్రీ నికోల్స్
విల్ యంగ్
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్)
డారిల్ మిచెల్
గ్లెన్ ఫిలిప్స్
జాక్ ఫాల్క్స్
కైల్ జేమీసన్
క్రిస్టియన్ క్లార్క్
ఆదిత్య అశోక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




