Madhunandan : వాడు పక్కన ఉంటూనే మోసం చేశాడు.. నమ్మి లక్షలు పోగొట్టుకున్నా.. నటుడు మధునందన్..
నటుడు మధునందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గుండె జారి గల్లంతయ్యిందే, ఇష్క్, అలా మొదలైంది వంటి చిత్రాలతో పాపులర్ అయ్యాడు. సహాయ నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే శంబాల చిత్రంలో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మధునందన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు మధునందన్. హీరోలకు స్నేహితుడిగా, కమెడియన్ గా కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు అతడు నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో.. తక్కువ సమయంలోనే తెలుగులో పాపులర్ అయ్యాడు మధునందన్. అయితే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించిన మధునందన్.. ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన పర్సనల్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. సినీరంగంలో స్నేహం పేరుతో మోసపోయానని అన్నారు. అలాగే ఇప్పుడు సినిమాలు తగ్గించడానికి గల కారణాలను వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
శంబల సినిమా షూటింగ్ విషయాల గురించి మాట్లాడుతూ.. ఒక గదిలో తనకు, అలాగే మరో నటుడికి జరిగిన ఒక అతీంద్రియ శక్తి గురించి ఎదురైన సంఘటనను తెలిపారు. ఇలాంటి అనుభవం ఎదురైనందున, దేవుడి గురించి సాగే శంబల కథ తనకు ఎంతగానో నచ్చిందని ఆయన తెలిపారు. సైన్స్‌కు అందని కొన్ని విషయాలు ఉంటాయని ఈ సంఘటన తనను నమ్మేలా చేసిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
అలాగే తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి మాట్లాడుతూ.. “ఎవరైనా సరే ఫ్రెండ్ అని నమ్మకం ఉంటే సరిపోదు.. కొన్నిసార్లు ఆ నమ్మకమే మనల్ని దారుణంగా మోసపోయేలా చేస్తుంది. నేను కూడా అలాగే మోసపోయాను. తిండి తిప్పలు మానేసి లక్షలు పెట్టి ఫ్రెండ్ వల్ల దారుణంగా మోసపోయాను. దాదాపు 18 గంటలు గతంలో సినిమాలు చేశాను. లక్షలు సంపాదించాను. 25 లక్షల వరకు తీసుకెళ్లి మా ఫ్రెండ్ కు ఇస్తే.. వాడు హోటల్ బిజినెస్ అంటూ వేరే వాడికి ఇచ్చాడు. అది లాస్ కావడంతో నిండా మునిగిపోయాను. ఇటు ఫ్రెండ్ అటు వాడిని అడిగి ప్రయోం లేకుండా పోయింది. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మి ఏది ఇవ్వకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
ఎన్నో సినిమా అవకాశాలు కోల్పోయానని అన్నారు. అదృష్టం ఉంటే ఎప్పుడు ఎవరికీ ఎలా అవకాశాలు వస్తాయో చెప్పలేమని.. ఇందులో వెన్నుపోటు ఏమిలేదని అన్నారు. అలాగే హీరో నితిన్ తో ఉన్న బాండింగ్ సైతం చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
