స్టార్ హీరోలతో సినిమాలు.. హీరోయిన్లకే వణుకుపుట్టించింది.. బలవంతంగా వ్యభిచారంలోకి .. చివరకు..
80వ దశకంలో సినిమా ప్రపంచాన్ని ఏలిన తారుల చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. తక్కువ సమయంలోనే సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ హీరోలతో నటించింది. కానీ చివరి రోజుల్లో మాత్రం ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ నరకం అనుభవించింది.

ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో నిషా నూర్ ఒకరు. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. 80వ దశకంలో డిమాండ్ ఉన్న హీరోయిన్. అప్పట్లో తన అందం, నటనతో యూత్ ను ఆకట్టుకోవడమే కాదు.. హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. సినీరంగంలో శిఖరాలకు చేరిన ఆమె.. చివరకు మురికి వాడలలో జీవించింది. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు సహా అనేక భాషల్లో వరుస సినిమాలు చేసిన నిషా నూర్.. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా, కమల్ హాసన్ ‘టిక్ టిక్ టిక్’, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శ్రీ రాఘవేంద్ర’ చిత్రాల ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ చిత్రం కళ్యాణ ఆగతిగాళ్‌లో నటించే అవకాశం అందుకుంది. 1990 నాటికి ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొత్త హీరోయిన్ల రాక.. పోటీ పెరగడంతో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. అప్పుడే నెమ్మదిగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆమె ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. సినిమాలను వదిలేసిన తర్వాత ఆమె జీవితం దారుణంగా మారిపోయింది. అప్పుడే ఓ నిర్మాతకు ఆమెకు సాయం చేస్తానని చెప్పి.. బలవంతంగా వ్యభిచార కుపంలోకి పంపించారట. బతకడానికి వేరే మార్గం లేకపోవడంతో, నిషా ఆ నరకంలో చిక్కుకుంది. అది ఆమె జీవితాన్ని నాశనం చేసింది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
ఆమెను చీకటి గదిలో బంధించారు. ఆమె ఎక్కడ కనిపించలేదు. 2007లో ఒక దర్గా దగ్గర అస్తిపంజరంలా పడిపోయి కనిపించింది. అప్పటికే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె పరిస్థితి చూసి ఒక ఎన్జీఓ సంస్థ ఆసుపత్రిలో చేర్చింది. నిషా నూర్‌కు హెచ్‌ఐవి (ఎయిడ్స్) సోకిందని వైద్యులు చెప్పారు. 2007లో నరకయాతన అనుభవిస్తూ మరణించింది.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
