Cinema: 33 సంవత్సరాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. పాటల గురించి చెప్పక్కర్లేదు..
తెలుగు సినిమాల్లోని కొన్ని పాటలు కోట్లాది మంది శ్రోతల హృదయాలను గెలుచుకున్నాయి. సినిమాలు హిట్ అయినప్పటికీ అందులోని పాటలు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ కలిగి ఉంటాయి. భావోద్వేగాలు... లిరిక్స్ మనసులను హత్తుకుంటాయి. కానీ మీకు తెలుసా.. ? ఒక మూవీలోని పాటలు మాత్రం ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి.

దక్షిణాది సినీప్రయాణంలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. దాదాపు 33 సంవత్సరాలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న మూవీ గురించి మీకు తెలుసా.. ? అలాగే అందులోని అన్ని పాటలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. మూడు దశాబ్దాల క్రితం విడుదలైన ఒక సినిమా దాని కథ, పాటలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ ఆ సినిమా రికార్డ్ మరో చిత్రం బీట్ చేయలేకపోయింది. ఒక సినిమా విజయం కోసం నిర్మాతలు, నటులు ఎంత కష్టపడతారో, ఆ సినిమాలోని పాటల విజయం కోసం సంగీత దర్శకుడు, గాయకులు కూడా అంతే ముఖ్యం. 1992లో విడుదలైన ఈ రొమాంటిక్ త్రిల్లర్ మూవీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
ఆ సినిమా పేరు రోజా. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇందులో అరవింద్ స్వామి, మధు, నాసర్, పంకజ్ కపూర్ నటించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన తన భర్తను రక్షించడానికి ప్రేమ, ధైర్యంతో పోరాడే యువతి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం దేశభక్తిని, భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధాన్ని అందంగా చూపిస్తుంది. ఇందులోని ఏడు పాటలు హిట్ అయ్యాయి. ప్రతి పాట ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీతో ఆయన కెరీర్ మలుపు తిప్పింది. తన తొలి చిత్రంలోనే అత్యుత్తమ సంగీతానికి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. దాదాపు రూ. 2.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 5.60 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం జాతీయ అవార్డుతో సహా 11 ప్రధాన అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాను యూట్యూబ్ లో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
