JD Chakravarthi : ఆ హీరోయిన్ తో లవ్ .. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. జేడీ చక్రవర్తి…
గులాబీ సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరో జేడీ చక్రవర్తి. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. కానీ కొన్నాళ్లకు నెమ్మదిగా సిని్మాలు తగ్గించేశారు. చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. అటు విలన్ పాత్రలు.. ఇటు సహయ నటుడిగా కనిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన నటుడు జేడీ చక్రవర్తి. గులాబీ సినిమాతో ఊహించని సంచలనం సృష్టించారు. అప్పట్లో ఈ మూవీ ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు సహయ నటుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సినీప్రయాణంలో తనకు ఎదురైన ముఖ్యమైన సంఘటనలను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఆయన నటించిన గులాబీ చిత్రంలోని పాట షూటింగ్ సమయంలో దాదాపు మరణం అంచు వరకు వెళ్లిన భయంకర అనుభవాన్ని వివరించారు. గన్నవరం బీచ్‌లోని ప్రమాదకరమైన ప్రదేశంలో అలల మధ్య చిక్కుకుపోయినప్పుడు, ఫైట్ మాస్టర్ నర్సింగ్ తన ప్రాణాలను కాపాడారని గుర్తుచేసుకున్నారు. నర్సింగ్ తన కాలికి తాడు కట్టి, ఒక రాయికి చుట్టి తనను రక్షించారని, ఆ తర్వాత దురదృష్టవశాత్తు నర్సింగ్ చనిపోయారని చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
గులాబీ చిత్రంలోని ఒక పాట చిత్రీకరణ గన్నవరం బీచ్‌లో జరుగుతుండగా, దర్శకుడు వంశీ ఒక ప్రమాదకరమైన ప్రదేశంలో నిలబడమని కోరారు. ఆ ప్రదేశంలో కొండ మీద నిలబడితే, భారీ అలలు వస్తాయని, అబ్బాయిని లోపలికి లాగేస్తాయని స్థానికులు చిత్రబృందాన్ని హెచ్చరించారు. ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి కూడా అదే ప్రదేశంలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ హెచ్చరికలను లెక్కచేయకుండా, దర్శకుడు వంశీ తనను అదే స్పాట్‌లో నిలబెట్టారు. ఒక భారీ అల వచ్చి తనను సముద్రంలోకి లాగేసిందని.. అప్పుడే ఫైట్ మాస్టర్ నర్సింగ్, వంశీకి తెలియకుండా, జె.డి. చక్రవర్తి కాలికి ఒక లావుపాటి తాడు కట్టి, దాన్ని ఒక రాయికి చుట్టి గట్టిగా పట్టుకున్నారు. ఆ తాడు కారణంగానే తాను అలల తాకిడి నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడ్డానని చక్రవర్తి తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు, నర్సింగ్ కొన్నాళ్లకే చనిపోయారని, తన ప్రాణాలను కాపాడిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
అలాగే మహేశ్వరితో లవ్ గురించి మాట్లాడుతూ.. దర్శకుడు వంశీ ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడ్డామని తెలిపారు. అయితే, ఆ అమ్మాయి వంశీని “అన్నయ్య” అని, తనను “బ్రదర్” అని పిలిచిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఆమె రిజెక్ట్ చేసిందని అన్నారు. నటి మహేశ్వరితో ఆయనకు గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని, పెళ్లి చేసుకోవాలనుకున్నారని, కానీ అది జరగలేదని ఇప్పటికీ ప్రచారంలో ఉన్న రూమర్స్ పై స్పందిస్తూ.. సినీ రంగంలో నటుల మధ్య తెరపై కనిపించే కెమిస్ట్రీని చూసి అభిమానులు ఇలాంటి రూమర్స్‌ను ప్రచారం చేయడం సర్వసాధారణమని .. ఇప్పటికీ ఎన్నో రూమర్స్ వస్తుంటాయని అన్నారు. తమ మధ్య పెళ్లి చేసుకోవాలని అప్పట్లో ఆలోచనలు ఉండవచ్చని, కానీ వివిధ కారణాల వల్ల అది కుదరలేదని అన్నారు. మహేశ్వరి ప్రస్తుతం వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారని, ఇటువంటి ప్రశ్నలు ఇప్పటికీ ఎదురవుతున్నాయని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
