వెనిజులా గులాబీ.. ఆకుల కింద దాక్కునే ఆ పూలను చూశారా..? ఎక్కడో కాదు మన దగ్గరే..
వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌తో సహా దక్షిణ అమెరికాకు చెందిన ఉష్ణమండల పుష్పించే చెట్టు... ఇప్పుడు విశాఖలో కూడా కనువిందు చేస్తోంది.. వెనిజులా గులాబీ పూలను విరబూసింది. సందర్శకులను తన వైపు ఆకర్షిస్తుంది. ఎర్రని అగ్ని కిరీటం లాంటి పూలతో చూపుతిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటుంది.

సృష్టిలో విభిన్న రకాల మొక్కలు, చెట్లు ఉంటాయి. కొన్ని ఫలాలను ఇస్తే.. మరికొన్ని పుష్పలను అందిస్తాయి. మరికొన్ని చెట్లు.. తనకు పూచిన పూలతో ఆకర్షించి ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి.. స్కార్లెట్ ఫ్లేమ్ బీన్.. దీనినే వెనిజులా గులాబీ (బ్రౌనియా గ్రాండిసెప్స్) అని కూడా పిలుస్తారు. వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌తో సహా దక్షిణ అమెరికాకు చెందిన ఉష్ణమండల పుష్పించే చెట్టు… ఇప్పుడు విశాఖలో కూడా కనువిందు చేస్తోంది.. వెనిజులా గులాబీ పూలను విరబూసింది. సందర్శకులను తన వైపు ఆకర్షిస్తుంది. ఎర్రని అగ్ని కిరీటం లాంటి పూలతో చూపుతిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటుంది. కిందకి వేలాడుతూ ఆకుల మాటున విచ్చుకొని మురిపిస్తుంది. విశాఖలోని డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ జీవవైవిద్య ఉద్యానవనంలో ఈ పూలు ఇప్పుడు వికసించి తనలో ఉన్న ప్రకృతి అందాన్ని తనివి తీరా ఆస్వాదించమనేలా కనిపిస్తోంది.
వాస్తవానికి ఈ పూలు మిగతా పూల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఒక సమూహంలా కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. పువ్వులు పెద్దవిగా, ఆకర్షణీయంగా, ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ-ఎరుపు రంగులో గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఇవి ఆకుల క్రింద వేలాడుతూ కనిపిస్తాయి. ఇంతటి అందమైన పుష్పాలను అందించే ఈ చెట్టు నెమ్మదిగా పెరుగుతుందని అంటున్నారు డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామమూర్తి. సతత హరితంగా ఉంటుంది. దాని అద్భుతమైన పూలు.. ఉష్ణమండల తోటలలో అలంకార మొక్కగా ప్రసిద్ధి చెందింది.
ఈ చెట్టుతో పాటు పూలలోనూ ఔషధ గుణాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉంది. చూసారుగా ప్రకృతి ఇచ్చిన అగ్నిపూల కిరీటాన్ని. మీరు ఎటువంటి అరుదైన పూలు, మొక్కలు, చెట్ల సమూహాన్ని చూడాలంటే.. ఒకసారి విశాఖలోని జీవ వైవిధ్య ఉద్యానవనానికి వెళ్లాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
