AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ సంక్రాంతి కానుక మీకు ఆందిందా?

కొత్త సంవత్సరం వేళ రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా మీ భూమి-మీ హక్కు పేరుతో రైతులకు కొత్త పాస్ పుస్తకాల అందజేస్తుంది. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం సమీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు.. ఎలాంటి తప్పులు లేకుండా గ్రామసభల్లో నిర్థారించుకున్న తర్వాతే రైతులకు పాస్‌ పుస్తకాలను అందజేయాలని అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.

AP Govt: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ సంక్రాంతి కానుక మీకు ఆందిందా?
Ap Farmers Get New Digital Land Passbooks
Anand T
|

Updated on: Jan 07, 2026 | 10:35 AM

Share

రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామసభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలన్నారు. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించి.. రికార్డులను తారు మారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దాలన్నారు. ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలన్నారు. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు.

మీ భూమి-మీ హక్కు

మీ భూమి-మీ హక్కు. ఇది రైతులకు ప్రభుత్వం కల్పించే భరోసా. ప్రస్తుతం ఇస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా..? లేదా..? అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. రికార్డుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే… కచ్చితంగా భూ యజమాని అనుమతితోనే జరగాల్సి ఉంటుంది. రికార్డులు భద్రంగా ఉండేలా కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రైతులకు వివరించాలి. భవిష్యత్తులో రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండానే రైతులు వారికి అవసరమైన పాస్ పుస్తకాలను ఆన్ లైన్లో పొందే విధానాన్ని అమలు చేయాలి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం వివరించారు.

6.07 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పంపిణీ విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6.07 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని సీఎంకు తెలిపారు. పట్టాదార్ పాస్ పుస్తకాల మీద రాజముద్ర, క్యూఆర్ కోడ్ వేయడంతోపాటు.. మీ భూమి-మీ హక్కు, జై భారత్.. జై తెలుగుతల్లి అనే నినాదాలు కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు
ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు
ఏంటమ్మా.. కొడుకు కన్నా చీరే ముఖ్యమా.. తల్లి చేసిన పనికి
ఏంటమ్మా.. కొడుకు కన్నా చీరే ముఖ్యమా.. తల్లి చేసిన పనికి
ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!
ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!
రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?
రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో.. ఇప్పుడు అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్..
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో.. ఇప్పుడు అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్..
11 రూపాయలకే సినిమా చూపించిన మేకర్స్..
11 రూపాయలకే సినిమా చూపించిన మేకర్స్..
పెంపుడు కుక్కే కదా అని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే.. ఏం చేసిందంటే
పెంపుడు కుక్కే కదా అని ప్రేమగా దగ్గరకు తీసుకుంటే.. ఏం చేసిందంటే
ఏపీలోని పింఛన్‌దారులకు శుభవార్త.. ఒక రోజు ముందుగానే నగదు
ఏపీలోని పింఛన్‌దారులకు శుభవార్త.. ఒక రోజు ముందుగానే నగదు
నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్
నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్
జింబాబ్వేను ఢీకొట్టే సూర్య సేన ఇదే..ప్లేయింగ్ 11లో భారీ మార్పులు
జింబాబ్వేను ఢీకొట్టే సూర్య సేన ఇదే..ప్లేయింగ్ 11లో భారీ మార్పులు