Andhra Pradesh: ఏపీకి కేంద్రం నుంచి భారీ శుభవార్త.. సంక్రాంతి వేళ సూపర్ న్యూస్
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా మరో కీలక నిర్ణయం వెలువడింది. ఈ రైల్వే జోన్ కోసం ఉద్యోగులను కేటాయించారు. దీంతో రైల్వే జోన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విభజన చట్టంలో ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండగా.. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం గతంలోనే పచ్చజెండా ఊపగా.. బిల్డింగ్ నిర్మాణాలకు కూడా అప్పట్లో ప్రధాని మోదీ శంకుస్ధాపన చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావొస్తుండగా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక ముందడుగు పడింది. విశాఖటలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పూర్తి స్థాయి నిర్వహణ కోసం ఉద్యోగులను రైల్వేశాఖ కేటాయించింది. ఈ జోన్ కోసం పనిచేసేందుకు దాదాపు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులు కేటాయింపు
త్వరలోనే ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. జోన్ ప్రక్రియను మరింత వేగంతం చేయడం, ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత జోన్ పనులు మరింత వేగవంతమయ్యే అవకాశముంది. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, సౌత్ కోస్టల్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశాఖలో ఏర్పాటు కానున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. దీంతో కొత్త జోన్‌పై మరో కీలక మందుడగు పడినట్లయింది.
మారనున్న ఉత్తరాంధ్ర దశ
ఈ కొత్త రైల్వే జోన్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర దశ, దిశ పూర్తిగా మారనుంది. రైల్వే కనెక్టివిటీ మరింత పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. అలాగే కొత్త కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశముంది. పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్ర ప్రజలకు లాభం జరగనుంది. ఇక ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు మరిన్ని రైల్వే సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. కొద్ది రోజుల క్రితం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చివరి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి విమానం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. దీని వల్ల ఉత్తరాంధ్ర పారిశ్రామికంగా అభివృద్ది చెందనుండగా.. కొత్త రైల్వే జోన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం కొత్త రూపు తీర్చిదిద్దుకోనుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జూన్‌లో ప్రారంభించనున్నారు.
