AP Medical Colleges: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు!
ఏపీ హైకోర్టులో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. మెడికల్ కాలేజీ వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆరువారాల పాటు వాయిదా వేసింది.

ఏపీ హైకోర్టులో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను ఏపీ హైకోర్టు పరిగణిలోకి తీసుకుంది. బుధవారం దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మెడికల్ కాలేజీ వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది.
అయితే పిల్‌లో వైసీపీ దాఖలు చేసిన పిల్‌లో కీలక అంశాలు ఉచింది. రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కలశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని వైసీపీ పేర్కొంది. ఆయా కాలేజీల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదని కోరింది. ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించటానికి వీటి ఏర్పాటు చేసినట్టు వైసీపీ తెలిపింది. మెడికల్ కాలేజ్ ల నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం విధానాలను రూపొందించిందని తెలిపింది.
మెడికల్ కళాశాలల్లో కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్ కి కేటాయించి ఆ డబ్బును ఆసుపత్రులకు వాడే విధంగా మార్గదర్శకాలు అప్పటి ప్రభుత్వం రూపొందించినట్టు తెలిపారు. అందుకే ప్రభుత్వం చేపట్టిన టెండర్లు ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. PPP వల్ల వైద్య విద్య దూరం అవటమే కాకుండా విద్యా, వైద్యం పేద ప్రజలకు దక్కకుండా కొనుక్కునే పరిస్థితి వస్తుందని వైసీపీ పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
